Others

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్వామా వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో మన సాయుధులు 40 మంది చనిపోవడంతో మొత్తం దేశ ప్రజలు తీవ్రమైన ఆగ్రహనికి, ఉద్విక్తకు గురికాగా, 12 రోజుల తర్వాత మన వాయుసేన సరిహద్దు దాటి పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలో గల ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని విధ్వంసం చేసి, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైష్ కు చావు దెబ్బకొట్టారు. ఈ సంఘటనతో మొత్తం దేశ ప్రజానీకం భావోద్వేగంతో మన సేనలకు సంఘీభావంగా నిలిచారు.
తర్వాత మన భూభాగంలోకి ప్రవేశించి మన సైనిక స్థావరాలపై దాడి చేయడం కోసం విఫల యత్నం చేశారు. వారి యుద్ధ విమానాలను తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా మన వింగ్ కమాండర్ అభినందనన్ పాకిస్థాన్ ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చే సమయంలో ప్రమాదానికి గురై ఆక్రమిత పాకిస్థాన్ భూభాగంలో దిగి పాకిస్థాన్ సేనలకు చిక్కారు. అయినా ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశ ప్రజలను అబ్బుర పరచాయి.
ముఖ్యంగా ఈ మొత్తం ఉదంతంలో భారత దౌత్యనీతి అసమానమైన ప్రతిభను ప్రదర్శించింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిగా చేయగలిగింది. చివరకు పాకిస్థాన్‌కు అండగా ఉండే చైనా సహితం ఆ దేశం పట్ల కనీసం సానుభూతి కూడా చూపలేక పోయింది. బ్లాక్ మెయిల్ చేసి భారత్‌ను లొంగదీసుకోవడానికి విఫల యత్నం చేసి, చివరకు మరో గత్యంతరం లేక దిగి రావలసి వచ్చింది.
మొన్నటి వరకు తమతో యుద్ధానికి వస్తే తమ అణుసామర్థ్యం భారత్‌కు కోలుకోలేని విధ్వంసాన్ని కలిగించగలదని బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చారు. కానీ మన వాయుసేన జరిపిన మెరుపు దాడులతో ఇక పాకిస్థాన్ తోక ముడవక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదం అంశంపై నేడు ప్రపంచం అంతా పాకిస్థాన్ ను నిలదీస్తున్నది. ఈ విషయంలో ఆ దేశం ఆత్మరక్షణలో పడింది. భారత్‌పై అవాకులు, చవాకులు ప్రేలి పబ్బం గడుపుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే మరో రెండు నెలలలో మన దేశంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఈ పరిణామాల ప్రభావం వాటిపై పడే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులలో దేశానికి ఎటువంటి నాయకత్వం అవసరమో ప్రజలు ఆలోచించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఇటువంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేయడం అసాధారణం కాబోదు. గతంలో అటువంటి ఉదంతాలు లేకపోలేదు.
1971లో బంగ్లాదేశ్ కోసం జరిగిన నిర్ణయాత్మక యుద్ధంలో ఘన విజయం సాధించిన తర్వాత ఒక సంవత్సరం ముందే లోక్‌సభను రద్దు చేసి నాటి ప్రధాని ఇందిరాగాంధీ 350 మేరకు సీట్లు గెలుపు పొంది అసాధారణ విజయం సాధించారు. దేశ ప్రజలు ఆమెను ఈ విషయంలో తప్పు పట్టలేదు. ఆమె విషాదకర పరిస్థితులలో మృతి చెందినప్పుడు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఒక సంవత్సరం ముందే లోక్‌సభను రద్దు చేసి 1984లో అనూహ్య రాజకీయ ప్రయోజనం పొందారు. ఇప్పటి వరకు ఎవ్వరు గెలుపొందలేని విధంగా 400కు పైగా సీట్లను గెలుపొంది రికార్డు సృష్టించారు.
అయితే ఈ సందర్భంగా ఒక అంశాన్ని గమనించాలి. బంగ్లాదేశ్ కోసం జరిగిన యుద్ధం గాని, ఇందిరాగాంధీ దుర్మరణంగాని, మొన్నటి పుల్వామా ఉగ్ర దాడి గాని, ఆ తర్వాత మన వాయుసేన జరిపిన మెరుపు దాడులు గాని రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న పక్షం కావాలని జరిపించినవి కావు. అప్పటి పరిస్థితులలో తప్పనిసరి పరిస్థితులలో జరిగిన సంఘటనలు. ఇటువంటి సంఘటనలలో సమర్థవంతమైన నేతృత్వం అందించిన నేతలు ప్రజల దృష్టిలో హీరోలుగా నిలబడతారని చెప్పడంలో సందేశం లేనే లేదు.
చివరకు 1999లో వాజపేయి హయాంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు సహితం కార్గిల్ యుద్ధం జరిగిన కొద్దీ నెలలకే జరిగాయి. ఇటువంటి సంఘటనలు జరిపి నప్పుడు రాజకీయ విబేధాలు విస్మరించి మొత్తం దేశం ఒక మాటపై నిలబడటం సహజమైన విషయం. ఈ విషయం లో అధికారంలో ఉన్నవారే కొంచెం పెద్దరికం ప్రదర్శించి అందరిని కలుపుకొని పోయేవిధంగా చేస్తుండాలి. యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో స్వయంగా ప్రధాన మంతృలు ప్రతిపక్ష నేతలకు ఫోన్లలోనో, సమావేశాలకు పిలిచొ పరిస్థితులను వివరించడం సహజముగా జరిగే పరిణామాలు.
గతంలో ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, వాజపేయి వంటి నేతలు ప్రతిపక్ష నేతల నుండి సహాయ, సహకారాలు కూడా పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం ఆవేదన కలిగించే అంశం. పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నిరసన ప్రదర్శన జరిపి, దేశం అంతా ఒక్కటే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక కూడా చేశారు. కాని ఏమైనదో గాని ఆ మరుసటి రోజు ఒక విధంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలకు విలువ ఇచ్చే విధంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దుమ్మెత్తిపోశారు.
మమతా బెనర్జీ మాటలకు సంఘీభావంగా అన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబ్ ముప్తి సహితం వేర్పాటువాదులకు నైతిక బలం చేకూరే విధంగా మాట్లాడారు. అయితే మిగిలిన రాజకీయ పక్షాల నేతలు చాలావరకు బాధ్యతాయుతంగా మాట్లాడారని చెప్పవచ్చు. బీజేపీ అంటే, ముఖ్యంగా నరేంద్ర మోదీ అంటే మండిపడుతూ ఉండే మజ్లిల్స్ అధినేత అసదుద్దీన్ ఆవాసి సహితం మెరుపు దాడులకు మద్దతు ప్రకటించడమే కాదు, జైష్ అధినేత మసూద్ అజార్‌ను ఆ విధంగా చంపివేయమని సూచించారు.
ప్రస్తుతం దేశంలో విభజన రాజకీయాలు శృతి మించుతున్న సమయంలో ఒక విధంగా రాజకీయ ఐక్యమత్యం ప్రదర్శించడం హర్షణీయం. దేశ రక్షణ విషయంలో రాజకీయ నాయకత్వం ఇదే విధమైన పరిణితిని ప్రదర్శించగలదని ఆశిద్దాము. సరిహద్దులో యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు తమకు దేశం ముఖ్యం అంటూ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ మార్చ్ 1 నుండి చేపట్టదలచిన ఆమరణ నిరాహారదీక్షను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాయిదా వేసుకున్నారు. కాంగ్రెస్ తన వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేసుకొంది.
పుల్వామా ఉగ్రదాడి జరగగానే ప్రతిదాడి జరిపే విషయాన్నీ సైన్యానికి అప్పజెప్పానని, ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఇచ్చానని ప్రధాన మంత్రి మోదీ సహితం చాలా హుందాగా ప్రకటించారు. అయితే ఆయన తన రాజకీయ కార్యక్రమాలను మాత్రం నిరాటంకంగా కొనసాగించడం కొంతమేరకు విమర్శలకు కారణమైనది. పుల్వామా దాడి జరగగానే రెండు రోజులపాటు ప్రధాని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ, అధికార కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించినా ఆ మాట మీద నిలబడలేదు.
ఈ సందర్భంగా దేశ ప్రజలలో వ్యక్తమైన సానుకూల ప్రతిస్పందనలను తమకు అనుకూలంగా మలచుకొని ప్రయత్నం అధికార పార్టీ చేయడం సహజమైన అంశమే. అందుకనే ‘మీరిచ్చిన వోట్‌తోనే ఇటువంటి వారి పని పట్టగలుగుతున్నాం. మీరిచ్చిన వోట్ తోనే దృఢమైన నాయకత్వం అందించ గలుగుతున్నాం. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికలలో వోట్ వేయండి’ అంటూ ఒక బహిరంగ సభలో ప్రధాని పిలుపిచ్చారు.
ఎన్నికలలో ప్రయోజనం పొందడం కోసం ప్రధాని మరిన్ని మెరుపు దాడులకు పాల్పడవచ్చని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన కొందరు కథనాలను ప్రచారం చేస్తున్నారు. అటువంటి ప్రకటనలు చేయడం చాలా బాధ్యతారాహిత్యం కాగలదు. ఇటువంటి కీలక నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకొంటారు అనుకోవడం దుర్మార్గం. కేవలం ఇటువంటి సంఘటనల సానుకూల ప్రభావంతో ఎన్నికలలో గెలుపొందడం సాధ్యం కాదని గ్రహించాలి.
1971 యుద్ధం నాటి పరిస్థితులు వేరు. నిజంగా నాడు మన సైన్యాధికారులు ప్రదర్శించిన అపారమైన సాహసం, వారికి అండగా నిలచిన నాటి ప్రధాని ఇందిరా గాంధీలను నేటి పరిస్థితులతో పోల్చలేము. దేశ రక్షణరీత్యా, బంగ్లాదేశ ప్రజల రక్షణ రీత్యా నాడు జరిగిన యుద్ధం ఒక చారిత్రాత్మకమైనది. ఆనాటి పరిస్థితులను సంకుచిత దృష్టిలో చూడలేము. ఆనాటి పరిస్థితులలో సహజంగానే ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. కానీ ఎప్పుడు అటువంటి పరిస్థితులే ఉంటాయని చెప్పలేము.
1999లో కార్గిల్ యుద్ధం అనంతరం జరిగిన ఎన్నికలలో వాజపేయి తిరిగి అధికారంలోకి రాగలిగిన బీజేపీ సీట్లు పెరగలేదని గమనించాలి. అయితే బీజేపీ మిత్ర పక్షాలకు సీట్లు పెరిగాయి. అంతకు ఒక సంవత్సరం ముందు 1998లో 182 సీట్లను గెలుచుకున్న బీజేపీ సొంతంగా 1999లో 180 సీట్లు మాత్రమే గెలుపొంద గలిగింది. అయితే ఆనాడు బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగు దేశం వంటి పార్టీలు బలం పెంచుకోగలిగాయి. ఇప్పడు కూడా, మరో 50 రోజులలో జరుగబోయే ఎన్నికలలో వోట్ వేసే విషయంలో ప్రజలు మొత్తం మీద ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న దేశ రక్షణ సంబంధ అంశాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పాటు చేయగలిగినా ఆ వాతావరణంతోనే ఆయన తిరిగి ప్రధానమంత్రి పదవి చేపట్టగలరని అనుకోలేము. ఆయన కూడా అటువంటి భ్రమలలో ఉన్నారని చెప్పలేము.
ఎన్నికలలో గెలుపొందడానికి సహకరించే అంశాలపై బీజేపీ కార్యకర్తలకు గురువారం సుమారు కోటిమందితో జరిపిన సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన వివరణలు ఇచ్చారు. యువత ఉపాధి వకాశాలు, రైతాంగ సంక్షౌభం వంటి సమస్యల ప్రభావం నుండి బైట పడటం కోసం బీజేపీ గత కొద్దీ వారాలుగా తీవ్ర ప్రయత్నాలు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం.
అసలు మోదీని ఓడించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎవ్వరికీ వారు హంగ్ పార్లమెంట్ ఏర్పడితే తాము ప్రధాని పదవి చేపట్టాలని ఆత్రుతతో ఉండడంతో పలువురి దృష్టి మోదీ వైపు నుండి ఇతర ప్రతిపక్ష నేతల వైపు మరలడం కూడా చూస్తున్నాం.

-చలసాని నరేంద్ర