Others

నిద్రపోతే బరువు తగ్గుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా ఎక్కువసేపు నిద్రతీస్తే బద్ధకం, ఊబకాయం తప్పవని మనం తరచూ వింటుంటాం. అయితే, తగినంతగా నిద్ర పోవడం వల్ల శరీరం బరువు తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మేలు చేసే కొన్ని బ్యాక్టీరియాలు పొట్టలో ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా దోహదపడతాయి. రాత్రిపూట మాత్రమే ఈ బ్యాక్టీరియాలు చురుగ్గా పనిచేసి జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి. రాత్రిపూట మనం బాగా నిద్రపోతే ఈ బ్యాక్టీరియాలు మరింతగా శక్తిమంతంగా పనిచేస్తాయట. రాత్రిపూట తగినంతగా నిద్రపోయేవారిలో జీర్ణవ్యవస్థ మెరుగుపడి, శరీరం బరువు తగ్గుతోందని పరిశోధనలో గుర్తించారు. గాఢనిద్ర కారణంగా ఏభై శాతం వరకూ బరువు సమస్య తగ్గే అవకాశం ఉందట. వేళకు భోజనం చేసి కొంత విరామం తర్వాత నిద్రపోతే ఊబకాయం సమస్య నుంచి గట్టెక్కే వీలుందని అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. రాత్రివేళ సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే జీర్ణక్రియ ఆలస్యమవుతుందని, పచ్చిమిర్చి వల్ల కొవ్వు కరిగిపోతుందని వారు చెబుతున్నారు. ఇక, మాంసాహారంలోని ట్రిప్టోపాన్ అనే రసాయనం వల్ల గాఢ నిద్ర పడుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంది. రాత్రిపూట రెండు, మూడు పుదీనా ఆకులను తిన్నా కొవ్వు సమస్య తగ్గుముఖం పడుతుంది.