Others

బ్రహ్మర్షి విశ్వామిత్ర (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరామారావు ప్రజానాయకుడిగా, ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్న రోజులలో తనలోని కళాతృష్ణను తీర్చుకునే ప్రయత్నంలో రామకృష్ణా సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన బహుచక్కని పౌరాణిక చిత్ర రాజం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఎన్టీఆర్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో హిందీ, తెలుగు వెర్షన్‌లో కలర్‌లో నిర్మితమైన చిత్రంలో ప్రసిద్ధ హిందీ కథానాయిక మీనాక్షి శేషాద్రి దేవ నర్తకి మేనకగా, ఎన్టీఆర్ విశ్వామిత్రునిగా ప్రణయ సన్నివేశాల్లో పాత్రలకు జీవం పోశారు. ‘అప్సరోభామిని చంచలాగామిని’ పాట ఎంతో బావుంటుంది. బాలు గళంతో హొయలు లయలు బాగా అనిపించాయి. రామలక్ష్మణులుగా లేత మొగ్గలు కుమరన్, గణేష్‌లు కనిపిస్తారు. హరిశ్చంద్ర, దుష్యంతునిగా నందమూరి బాలక్రిష్ణ, దీపికలు తెలుగు వెర్షన్‌లో నటించగా, హిందీ వెర్షన్‌లో అరుణ్‌గోవిల్, అర్చనా జోగ్లేకర్ పాత్రోచితంగా నటించారు. విశిష్టమైన వశిష్ఠ పాత్రని గుమ్మడి పోషించి శెహబాష్ అనిపించుకున్నారు. బాల భరతునిగా జూ.యన్టీఆర్ సింహాల పిల్లలతో జూలుపట్టి ఆడటం బావుంటుంది. ఫొటోగ్రఫీ అద్భుతం. పక్షులు, జింక పిల్లలు, కుందేళ్లు, పచ్చని పొదలతో ఆశ్రమ వాతావరణం కనుల పండగనిపించేలా సెట్ వేసి చూపించారు. జేసుదాస్ పాట ‘ప్రియా చెలియా పిలిచే వౌనమా మత్తకోకిలలు మధుర సారికలు మంగళ గీతాలు పాడగా’ అనే పాట చెవులకింపనిపిస్తు మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది. రామానంద్‌సాగర్ సంగీతం శ్రావ్యోపేయం. చిత్రంలో ఎక్కడా అశ్లీలత అనిపించదు. ఆద్యంత రమణీయంగా ఉంటుంది. మంచుకొండలు, పచ్చని చెట్లు, చక్కని నట విన్యాసాలతో హుషారు గొలుపుతుంది. విశ్వామిత్రుని గూర్చి తెలియనివారికి ఈ చిత్రం చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. సీతారామకల్యాణం, వశిష్ఠునితో వాగ్వావాదం, హరిశ్చంద్రుని సత్యనిరూపణ, సత్యరథుడనే మహారాజు రాజ్యాన్ని విడచి తపోదీక్షతో ఎన్ని అడ్డంకులొచ్చినా అవాంతరాలను లెక్కసేయక తాను ఏర్పరచుకున్న లక్ష్యంతో చివరకు ‘బ్రహ్మర్షి’ కావడం, లోకోపకారార్థం గాయత్రీ మహామంత్రాన్ని ఆవిష్కరించడం లాంటి సన్నివేశాలు కళ్లకుకట్టినట్టు చూపించారు ఎన్టీఆర్. క్షత్రియ బలం నబలం, బ్రహ్మతేజోబలం బలమన్నది చూపిస్తూ సాగే మహాతపస్వి గాథ. దురదృష్టం ఏంటంటే -హిందీ వెర్షన్ ఇప్పటికీ విడుదల కాలేదు.

-జి బలరాముడు, గుడివాడ