Others

అనంత మహిమాన్వితం అక్కపెల్లి రాజేశ్వరాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగ వైకుంఠంగా, భూకైలాసంగా హరిహర క్షేత్రమై విరాజిల్లుతున్నది, గంభీర గౌతమీ తీరస్థ ప్రాచీన తీర్థరాజం, ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి. ఈపవిత్ర క్షేత్రానికి దక్షిణ దిశగా, ఎతె్తైన దిబ్బపై, వాస్తు శాస్త్రానుసార, సానుకూలమైన తావులో మహిమాన్వితమైన అక్కపెల్లి రాజేశ్వరాలయం విరాజమాన మవుతున్నది. క్షేత్రానికి అత్యంత సమీపాన, ప్రశాంత వాతావరణంలో, సాలగ్రామ స్వరూప శివలింగంతో అలరారుతున్న రాజేశ్వరుడు, ఆపక్కనే భక్తుల పాలిటి కల్పతరువైన శ్రీనృసింహుడు వెలసి, ఆప్రాంతానికి ఎనలేని ప్రత్యేకతను సంతరింప జేస్తున్నది. శతాబ్దాల చారిత్రిక నేపధ్యం కలిగిన అక్కపెల్లి రాజేశ్వరాలయం విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నది. క్రీ.శ.1448 రామభద్రాశ్రమ స్వామి దానపత్రిక ఆధారంగా, రామభద్రాశ్రమ స్వామికి సమకాలీన రాజులు ధర్మపురి చుట్టుపక్కల భూమిని దానంగా ఇవ్వడం జరిగింది. ఈపరివ్రాజకుని కాలంలో క్రీ.శ.1425లో ధర్మపురి విమతస్తుల దాడిలో చిన్నాభిన్నం అయింది. స్థానిక గాథలననుసరించి, క్షేత్ర విప్ర కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళుతుంటే రామభద్ర స్వామి వారిని సాంత్వన పరిచి, వలసలను నిలిపి, తాత్కాలికంగా అక్కపెల్లి రాజేశ్వరాలయ సమీపాన భూముల్లో నివాసాల ఏర్పాటు చేయించారు. నారాయణ పురమని స్వామి ఈగ్రామాన్ని పిలిచేవారు. 1439లో నారాయణాశ్రమం పేరుతో బ్రాహ్మణులకు ఇళ్ల వసతులు ఏర్పాటు చేశారు. ఈతాత్కాలిక వసతిలో పూజకై అక్కపెల్లి రాజేశ్వరాలయ, సమీపాన ఒక చిన్న నృసింహుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాడుల ఫలితంగా భయభ్రాంతులకు గురైన ప్రజలు, అక్కపెల్లి రాజన్న దేవాలయ గర్భ గుడిలోనుండి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. దీనిని నేటికీ కాశీ సొరంగమని ప్రజలు చెప్పుకుంటారు. ఆలయ సమీపాన బావి, ఆలయాన్ని అంటుకుని, దీపారాధనకు వీలుగా గూళ్ళు కలిగిన దీపస్థంభం ఉన్నాయి. కాల గమనంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్గొన్న ఈఆలయం ఇటీవలి కాలంలో, భక్తుల సహకారంతో నిత్య దీప ధూప నైవేద్యాదుల నిర్వహణకు ఏర్పాట్లు చేయబడినాయి. 116 రూపాయలతో శాశ్వత సోమవార అన్నపూజాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. శివరాత్రి సందర్భంగా దేవస్థానం అర్చకులు జనమంచి శ్రీనివాస శర్మ, బూస ప్రవీణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఉత్సవాలకై దేవాదాయ శాఖనుండి అదనంగా డెప్యుటేషన్‌పై ఉద్యోగులను నియమించనుంది. 151రూపాయల చెల్లింపుతో వేదపండితులచే భక్తుల గోత్రనామాదుల పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9గంటలకు రుద్రాభిషేకాలు, శాశ్వత పూజలు, మద్యాహ్నం 12గంటలకు మహామృత్యుంజయ జపం, సాయంత్రం 6గంటలకు శివకళ్యాణం, రాత్రి 10గంటలకు భజన కార్యక్రమాలు, అర్ధరాత్రి నిషి పూజలు, లింగోద్భవ పూజలు, తెల్లవారి ఉదయాత్పూర్వం 5.గంటలకు రథోత్సవం, మద్యాహ్నం అన్నపూజ, అన్నదానం నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది.

చిత్రాలు.. రాజేశ్వరాలయం, సాలగ్రామ స్వరూప అక్కపెల్లి రాజేశ్వర స్వామి

- సంగనభట్ల రామకిష్టయ్య