Others

అభిషేక ప్రియా... ఆదిశంకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓం నమశ్శివాయ’ అనే షడక్షరీ మంత్రమే అన్నిచోట్ల వినిపించేపండుగే శివరాత్రి.ఈ శివరాత్రినాడు శివలింగాన్ని ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి, జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి, తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి, నందివర్థనంతో పూజిస్తే సౌందర్య ప్రాప్తి, నువ్వుపూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి, గనే్నరు పూలతోపూజిస్తే శత్రునాశనం, శిరీష పుష్పాలతో పూజిస్తే సంతోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయ. శివ, భవిష్య, లింగ పురాణాలు శివరాత్రి ప్రశస్త్యాన్ని చెప్తున్నాయ. వజ్ర లింగం, మరకత లింగం, పద్మరాగ లింగం, స్పటిక లింగం లాంటి వాటికి చేసే లింగాభిషేకాలు జరిపినా కలియుగంలో పార్థివ లింగానికే పూజలు ప్రశస్తమైనవని పురాణాలు ఘోషిస్తున్నాయ.
పెండ్లికాని యువతులు ఈ పండుగనాడు దీక్ష వహించి శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని విశ్వసిస్తారు. అపమృత్యుభయంతో బాధపడేవారు పరిశుభ్రమైన నువ్వుల నూనెను శివలింగంపై పోసి, మృత్యుంజయ జపాన్ని చేస్తే, సంతుష్టాంగుడైన ఆ పరమశివుడు అపమృత్యువునుంచి కాపాడతాడని శివపురాణం చెప్తుంది. సర్వసంపదలు వృద్ధిపొందడానికి కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేయాలి. సర్వభోగలనూ విసర్జించి, నిద్రను త్యజించి రాత్రి నాల్గు జాములూ శివనామస్మరణ చేయడమే ఉపవాసమని భవిష్యపురాణం ఉద్ఘోషిస్తోంది. శివరాత్రి నాడు సత్యానే్న పలుకుతూ ధర్మాచరణలో కాలం గడపాలి. ఇట్లా చేసిన వారికి ఈశ్వరసంహిత శివసాయుజ్యం లభిస్తుందని చెప్తోంది. జగద్గురువు ఆదిశంకరాచార్యుడు మహాశివుడ్ని శివానందలహరితో అర్చించాడు. కన్నప్ప అచంచల భక్తితో కన్నునే సమర్పించి శివుని మెప్పును పొందాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని నమ్మి అనల్పాయుష్కుడయ్యాడు. దుష్టలను దునుమాడి శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించి పాపాలను పొగొట్టుకున్నాడు. శివపూజకు సర్వప్రాణికోటి అర్హులే. దీనికి తార్కాణంగాశ్రీకాళహస్తి నిలుస్తుంది.

-చివుకుల రామ మోహన్