Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ అంచనాలతో అప్పుడప్పుడూ వస్తున్న చిత్రాలు ఒక్కసారిగా ఢామ్మంటున్నాయి. సరైనోడు చిత్రం తరువాత తెలుగు ప్రేక్షకులకు బిచ్చగాడు సినిమా ఒక్కటే ఫర్వాలేదనిపించింది. తరువాత ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్‌ను గలగలలాడించలేదు. ఈవారం భారీ అంచనాలమధ్య రజనీకాంత్ హీరోగా ‘కబాలి’, చిన్న చిత్రాలుగా గోపీనాథ్ నేతృత్వంలో ‘ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్’, ఎక్స్‌వైజెడ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ మూడు చిత్రాలూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. కబాలికి డివైడ్ వౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు కుప్పకూలి -గ్రాఫ్ ఎక్కడకు చేరుతుందోనన్న అనుమానాలున్నాయి. చిన్న సినిమాల్లో ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్ కథ కథనాలు ఫర్వాలేదనిపించినా థియేటర్ల వద్ద ప్రేక్షకులు లేరు. ఎక్స్‌వైజెడ్ చిత్రం హారర్ జోనర్‌లో రూపొందినా ప్రేక్షకులను భయపెట్టడంలో విఫలమైంది. బాలీవుడ్ చిత్రంగా విడుదలైన మదారి మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లను కబాలి ఆక్రమించేయడంతో, తెలుగు చిన్న చిత్రాలకు థియేటర్లు కూడా పెద్దగా దొరకలేదు.