Others

నమ్మక ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకు
కన్నీరు కారుస్తున్నావు?
కడుపుబ్బా నవ్వించినందుకా?
ఏడుపును నీ కళ్ళనుండీ
తగ్గించినందుకా?

నమ్మకాన్ని సొమ్ము చేసుకునే
దొంగస్వాముల జపమాలలో
ఒక రుద్రాక్ష కనె్నర్రబడిందా?
పాతాళంలో దాక్కున్నా
జెడలు పర్చుకున్న నీ జుత్తును సైతం
పట్టి లాగి
తన్నులు తినే అవస్థ తప్పదు గాక తప్పదని
ఓ శాపం పాపంలా
వెంటాడుతుంది జాగ్రత్త!!
రైలుని సృష్టించి
పట్టాలెక్కిస్తే
పట్టాలను చీల్చి పేల్చి
ప్రమాదాన్ని సృష్టించే
ప్రయత్నంలో వున్న నువ్వు
సహాయకారివో... వినాశకారివో
ప్రపంచ అద్దం ముందు అర్థమవ్వకమానదు!

నమ్మకం -
‘ద్రావకం’ లాంటిది!
లోహాలతో కలిసున్న కల్తీని వేరుచేసి
బంగారం వనె్నని వెన్నముద్దలా
చేయంచగలదు!
నమ్మకద్రోహం లాంటి నీ ఒంటిపై పడి
నీ తాటమీద బొబ్బలెక్కించి
నొప్పులతో బెంబేలెత్తించి
మాయని మచ్చగా మిగిల్చి
నీ జీవితాంతం తలుచుకొని తలుచుకొని
కుమిలిపోయేలా చేయంచనూ గలదు
తస్మాత్ జాగ్రత్త!!

- చలపాక ప్రకాష్, 9247475975