Others

సైబరక్వేరియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశాన్ని శోధిస్తూనే
అఖాతాల్లోకి ముడుచుకుంటూ
శిఖరాలెక్కుతూనే
శిథిలాల్లోకి జారిపోతూ

ఏవేవో తరంగాల అలలపై
ఈదుతున్న సమూహాలు
సైబరక్వేరియంలో చేపలైన జీవితాలు
క్షణాలుగా క్షణాలుగా విడిపోతూ కలుస్తున్న
నగర కూడళ్లలో వాహనాలు

ఎంత విజ్ఞానం పెంచుకున్నామో
అంతే విషాన్ని
కుదుళ్లల్లో నింపుకుంటూ
ఎన్ని విజయాలు సాధించామో
అన్ని వినాశనాలు విత్తుకుంటూ

ఎన్ని వలయాలు
ఎనె్నన్ని అల్లికలు
పేగుల పోగుల్ని అతికించుకున్నట్టే తెంపుకుంటూ

రెక్కలొచ్చిన ఫేస్‌బుక్ చిలకలై
గిరికీలు కొడ్తున్న వాట్సప్ పావురాలై
ట్విట్టర్ పిచ్చుకల పాటలై
నెట్టింటి పడుచులే ప్రతి నట్టింట
నవ్వుతున్న దీపాలై
ఎన్ని స్పర్శించలేని చూపుల్ని
వాసనలేని నవ్వుల్ని, నెగడు వంటి నిట్టూర్పుల్ని
తెరలపై చిత్రించుకున్నామో...
ప్రతి దగ్గరితనం పదివేల మైళ్ల దూరంలా
ప్రతి సమూహం చేయ కలపని ఒంటరిలా
కొన్ని ఊహల్ని రేఖలుగా గీసుకుంటూ
సముద్రాలెన్నున్నా
సముద్రాల అంచుల్ని తాకుతూ
సంభాషించే భూగోళమంతా
ఇప్పుడు సైబర్ మహాసముద్రంలో తేలుతున్న
ఫైబర్ ఓడయ్య నడుస్తున్న కాలాన్ని
స్వయంగా సంతకం చేస్తున్నప్పుడు

ఒక చెట్టో, ఒక పక్షో, ఆఖరికి మనిషో
టచ్ స్క్రీన్‌లో వెచ్చని శ్వాసని శ్వాసిస్తూ
మనుషులున్న ఇళ్లూ
ఇళ్లను ముడేసుకున్న ఊరు
ఊర్ల ఉగ్గుపాలు తాగి బతుకుతున్న దేశం
అన్నీ మాట్లాడే రంగురంగుల
అక్వేరియాల గాజుపెట్టెలైనట్టే
ప్రపంచమే ఒక అక్వేరియం బంతిలా
విశ్వమైదానంలో పీడనా డోలనాలు చేస్తూ

భవిష్యత్తునంతా సిల్వర్ ఫిష్‌లానో,
గోల్డ్ ఫిష్‌లానో కలలు కంటూ
తిమింగలాల, సార్క్ చేపల వేటలో
ఎరలైపోతున్న వర్తమానాన్ని
ఏ నదిలోకి పంపి దాచుకోవాలి

మోడువారుతున్న మనిషి చెట్లను
వేర్లు కుళ్లిపోకుండా ఎన్ని కన్నీళ్లని
పాదులు నిండా నింపి కాపాడుకోవాలి
పాదుల ఒడ్డున పారే కాల్వలో
మనిషితనపు చేపపిల్లల్ని
ఎలా భద్రంగా భద్రపరుచుకోవాలి?

- పల్లిపట్టు నాగరాజు, 9989400881