Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టుమంచు పదియేడులె! బాలుడనే గానో?
వ్రేలెడంత లేనప్పుడు- వేల మాట లేలనో?

అది సరియే వారెందుకు ఆడినారొ తానమ్ముల?
ఆ వేళల నేనెందుకు ఆ తావుల కేగితినో?

ఊరక నిందింత్రు గాని
నేరుదురే మీరలు?

పతిగానను కోరుకొంచు వ్రతము సల్పినారు
చేసినారు తానాలను నోమునోచినారు

దానినెరిగి చేరుకొంటి నేనచ్చటి కోరుూ!
వారి వలువలపహరించి వారి బ్రోచితోరుూ!

నాకెందుకు ఆ వలువలు? నాకెందుకు కన్నియలు?
చేడెలకొక పాఠమ్మును జెప్పజూచితోయి!

దేహమ్మే జీవియనెడు భ్రాంతి తొలగజేసితి
‘సోహమ్మ’ను మంత్రమ్మును నేనుపదేశించితి.

రెండింటిని ఒక విధాన చూచుట యుక్తమ్మే?
రెండింటిని ఒక గాటను కట్టుట న్యాయమ్మే?
కృష్ణపత్నులు:
సరిలే! సరి సరిలే! మీ మగవారల మాటలు!
సరిలే! మీ మాటలెల్ల వట్టి నీటి మూటలు!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087