Others

మానసిక పరివర్తనకు మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భౌతికంగా క్షుద్బాధా నివారణ మాత్రమే కాదు దీని పరమావధి. ఒక అనిర్వచనీయ శక్తి ప్రసారానికి మానసిక పరివర్తనకు అమ్మ ఎంచుకున్న మాధ్యమం అన్నపూర్ణాలయం. అమ్మ నిరంత రమూ నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టు. అంతా ‘పైవాడే’ చేయిస్తున్నాడనుకో అంటూ అమ్మ పదే పదే ఇచ్చిన సందేశం. ఈ అమ్మ ఎవరో కాదు జల్లేళ్ళమూడి అమ్మ. అమ్మ దగ్గరకు వచ్చిన వారికి ఆకలి బాధే కాదు, వారికి దేవుని కోసం పరితపించే ఆకలితీరుతుంది. సీతాపతి, రంగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా మన్నవ లో జిల్లేళ్ల మూడి అమ్మగా ప్రసిద్ధి గాంచిన మాతృశ్రీ అనసూయాదేవి 1923 మార్చి 23న అమ్మ జన్మించారు.
ఆమె 13వ యేట జిల్లేళ్ళమూడి కరణంగారు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో వివాహం అయింది. అప్పటినుండి జిల్లేళ్ళమూడి ఆ తల్లి స్థావరం అయంది. చిన్నప్పటి నుంచి దైవ భక్తిగల అనసూయాదేవి వయస్సుతో పాటు తన దైవశక్తిని పెంచుకుంటూ వచ్చింది. అమ్మను చిన్న ప్పుడే కారణజన్మురాలు అనేవారు. ఆమె చిన్ననాటి నుంచి అనేకానేక మహిమలను చూపేవారు. అమ్మకు 3 యేళ్ళప్రాయంలో తల్లి మరణిస్తే ‘‘దేవుడు పంపినవాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరకేపోతే మధ్య మనం ఏడవటం ఎందుకు’’ అని ఆ పసివయసులోనే అసాధారణ తాత్త్విక జ్ఞానంతో ప్రశ్నించింది.
అపుడే ఆ వయస్సులోనే దైవం మీద అపారమైన నమ్మకమే కాక చావుపుట్టుకల గురించిన జ్ఞానం అమ్మకు ఉన్నదన్నమాట. అమ్మ ఏ పాఠశాలలోను, ఏ గురువువద్దా చదువుకోలేదు. అయినా ఎందరికో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపింది, సాధనా సూక్ష్మాలు తెలిపింది. అమ్మ మాటలు వేదవాక్కులే. ఏ వయస్సు వారికైనా అమ్మ మాటలు నిజంగా తల్లి మాటల్లాగా చక్కగా ప్రేమమయంగా చెపుతున్నట్టు ఉండేవి. అమ్మ ఎపుడూ కఠినంగా మాట్లాడేది కాదు.దైవానికి కులమతాలు లేనట్టే అమ్మకు కులమతాలు అంతరాలు లేవు. పేద ధనిక భేదాలు అసలే లేవు. అమ్మ అని పిలిచినంతనే వారి కష్టాలను తీర్చడానికా అన్నట్టు వారితో అమ్మ మాట్లాడేది. అమ్మవాక్కు అమృతంలాగా ఉండేది.
ఆమె దర్శనానికి ఎవరు వచ్చినా ముందు భోజనం చేసి రా నాయనా అనేది. 1958 వరకు తనను చూడవచ్చిన బిడ్డలందరికి తనే వండి వార్చి గృహస్త ధర్మం పాటించింది. అమ్మ దర్శనార్థుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయానికి అంకురార్పణ జరిగింది. గాడిపొయ్యిలో నిప్పు వెలిగిస్తూ- ఇది అఖండ యజ్ఞం, మాతృయజ్ఞం, జగన్నాథ రథం కదిలింది. ఇక ఆగదు అన్నది అమ్మ. అన్నట్లుగానే 50 యేళ్ళ పైబడి నిర్విఘ్నంగా నిరతాన్నదానం జరుగుతోంది. అనుష్టాన వేదాంతానికి అద్భుతమైన ఉదాహరణ అమ్మ ప్రారంభించిన అన్నపూర్ణాలయం.
అమ్మకు అన్నపూర్ణకు భేదం లేదు. అన్నపూర్ణాలయం అమ్మ గుండె లయ. వచ్చినవారందరికీ అన్నం తినమని చెపుతుంది అమ్మ. తిని వచ్చామంటే ఎంత ఆకలయితే అంత ప్రసాదమనుకుని తిను అనేది. ఒక్కొక్కసారి తానే కలిపి అన్నం ముద్ద నోటికి అందించేది. అలా అమ్మ చేతి ముద్ద తిన్న వారిలో శ్రీశైలం పూర్ణానందస్వామి, విశ్వయోగి విశ్వంజీ లాంటి ఆధ్యాత్మికవేత్తలు ఉండటం విశేషం. ఒక మహావిభూతి సంకల్పించి సాకారం చేసిన చారిత్రిక సన్నివేశం. ఇప్పటికీ అమ్మను తలుచుకున్నవారికి అమ్మ దయ లభ్యమవుతుంది.

- కె. వాణిప్రభాకరి