Others
మహిళాశక్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 March 2019
-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949
సీ॥ సర్వజనాళికిన్ సంపదలనొసంగు
రాజిత శ్రీ మహాలక్ష్మివీవు
సకల ప్రాణితతికి జవ జీవములనిచ్చి
చక్కగా నిలబెట్టు శక్తివీవు
పండితోత్తములకు పామర జనులకు
స్వరమున విలసిల్లు వాణివీవు
సరసీరుహానను చరణాబ్జనిర్గత
కలుషభంగయగు స్వర్గంగవీవు
తే.గీ॥ పాడిపంటలనిచ్చియు పసిడినిచ్చి
తెరువు జూపెడిధన్య భూదేవివీవు
రంగమేదైనయగుగాక! రాణివీవు
నీకు ఎదురేది? తిరుగేది? నిఖిల జగతి॥