Others

కుండలినీ ధ్యానం( శ్రీచక్రము, మానవ శరీరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు H.No. 7-8-51, Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 79
================================================================
శ్లో॥ మూలాధారాడుద్గతా మాదిశక్తిం
సహస్రార ప్రాంత విశ్రాంత దీప్తిమ్
బ్రహ్మాత్యైక్య ప్రాపకామోషుకుల్యాం
వందే, వందే, కుండలిన్యాఖ్యదేవీమ్‌॥
అర్థము:- మూలాధారము నుండి పైకి లేచిన ఆదిశక్తి, సహస్రార చక్రమున విశ్రమించిన దివ్యకాంతి, పరమాత్మ లేక బ్రహ్మాత్యైక్య సంయోగాన్ని ఏర్పరిచే అద్భుతమై న కాలువ వంటి కుండలినీ మా తకు అనేకానేక నమస్కారములు.
ధ్యానము అంటే ఏమిటి:-
ధ్యానము ఏకాగ్రత, ఈ రెండు పరస్పరాధారాలు, సమాజంలో చాలామందికి ధ్యానమనేది, ముముక్షువులకో, మునులకో, ఋషులకో, తపస్సమాధికోరువారికో లేక యోగులకో, మాత్రము సంబంధించిన విషయమనే అభిప్రాయము కలదు. కాని నిజం విచారిస్తే ఈ ధ్యానం అందరికీ అవసరమేనని అవగతమవుతుంది. ప్రతి పనికి ఏకాగ్రత అవసరం. అట్టి ఏకాగ్రతకొరకు ధ్యానమవసరం. ఈ విషయాన్ని ఋగ్వేదము స్పష్టముగా చెబుతోంది. అదెట్లనిన
శ్లో॥ ఉద్భుధ్యధ్వంస మనసః సఖాయః
సమగ్ని మింధ్యం బహవః సనీలాః
దధిక్రామగ్ని ముషసంచ
దవీమింద్రావతో‚ వే నిహ్వయేవహః
(ఋగ్వేదం 10.10.1)
అర్థము:- ఏ సంఘములో గాని సమాజంలోకాని అధిక శాతం ప్రజలు, ఒకే రకమైన, ఉన్నతమైన మనసు అభిప్రాయం, సంకల్పం కలిగి ఉంటారో అట్టి సమాజం గొప్పస్థితిని సాధిస్తుంది. అంతేకాదు అట్టి సమాజంలోని ప్రజలంతా ‘‘ఏకాగ్రచిత్తులై జ్ఞాన తేజోమూర్తులై వెలుగొందుతారు.’’
మన పురాణాలలో ఋషుల కథలలోని యితిహాసాలలో అనేకచోట్ల ఘోరమైన తపస్సుచేసిన వారి వృత్తాంతాలు మనకు కనిపిస్తాయి. కుమార సంభవంలో పార్వతీదేవి (అపర్ణ) తపస్సు, భాగవతంలో హిరణ్యకశిపుని తపస్సు, రామాయణంలో రావణుని తపస్సు, విశ్వామిత్రాది మహర్షుల తపస్సులు యెన్నో కఠోర నియమాలతో కూడినవి. అట్టి తపస్సునాచరించి తమ ధ్యేయ దేవతానుగ్రహంతో వరాలనుపొంది తమ కోర్కెలు నెరవేర్చుకున్నారు. ప్రాచీనయుగాలలో అనుసరించిన తపోమార్గాలటుండేవి. కృతయుగంలో శరీరం, ఎముకలుంటే చాలు, చర్మము, మాంసము, రుధిరాధి ధాతువులు లేకపోయినా ప్రాణాలు నిలిచేవి. త్రేతాయుగంలో ప్రాణం చర్మగతమై వుండేదని, ద్వాపర యుగంలో మాంసమున్నంత కాలము ప్రాణం ఉండేదని చెప్పబడుతోంది.అప్పటి యుగాలు ప్రకృతి ధర్మాలు, ఆయుఃప్రమాణాలు అలా వుండేవి అనుకోవాలి. కలియుగంలోని అన్నగత ప్రాణులకు అంత శక్తి ఎక్కడిది? అట్టి మహానుభావులు చాలా అరుదు. శాక్యవంశస్థుడైన సిద్ధార్ధుడు బుద్ధతత్త్వాన్ని, అనేక జన్మలుగా సాధ్యంకాని జ్ఞానాన్ని పొందటానికి నిశ్చలచిత్తుడై రుూ విధంగా ప్రతిజ్ఞచేసి తపస్సుకు కూర్చున్నాడు.
శ్లో॥ హాసనేశుష్యతు మేశరీరం
త్వగస్థి మాంసాణి లయం చయాంతు
అప్రాప్యబోధం బహుజన్మ దుర్లభం
నైవాసనాత్ కాయ మత శ్చిలిష్యతి
భావము:- నేను కూర్చున్నచోటనే శరీరము శుష్కించుగాక, మాం సము, చర్మము, ఎముకలు నశించినాసరే బహుజన్మ దుర్లభమైన ఆ పరాసత్యమైన జ్ఞానాన్ని పొందనిదే రుూ ఆసనమునుండి శరీరము కదలదు గాక అని ప్రతిజ్ఞచేసి సాధించాడు గౌతమబుద్ధుడు.
అంటే ఒక మనిషి తన అభీష్టాన్ని నెరవేర్చుకోవటానికి లౌకికమార్గాలలో సాధ్యంకానప్పుడు, కఠోరమైన తపోమార్గం ద్వారా సాధించేవారు. సద్గురూపదేశంతో సంబంధిత దేవతా మంత్ర జపంతో తదేక ధ్యానంలో సమాధిస్థితిని పొందిన వ్యక్తులు (సదాశివ బ్రహ్మేంద్రస్వామి, రమణ మహర్షి, షిర్డిసాయిబాబా, రామకృష్ణ పరమహంస, రాఘవేంద్రస్వామి వంటి ఆధునిక యోగులెందరో) కుటీరంలో కూర్చున్నా, చెట్టుకింద కూర్చున్నా హిమాలయాల్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా వారికి ఒక్కటే.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014