Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వెలుగుల్లో ఒక నక్షత్రంలా వెలిగిపోతోన్న ఆ కృష్ణుని చుట్టూ ‘రాధాకృష్ణుల’ భజన చేస్తూ, వెలుగుచుట్టూ వెలుగులా ప్రదక్షిణ చేసింది. ఆమె సపత్నులు ఆమె వెనకాలే చేరి గ్రహోపగ్రహాల్లా కృష్ణుని చుట్టూ తిరిగారు.
కాసేపటికి ఆ వెలుగు మాయమైపోయింది.
కాదు. శ్రీకృష్ణునిలో కలిసిపోయింది.
అప్పుడే కొలిమిలోంచి కరిగించి తీసిన బంగారు ముద్దలా, స్వర్ణకాంతులతో వెలిగిపోయాడు శ్రీకృష్ణుడు.
ఒక మబ్బువీడిన సూర్యబింబంలా పులుకడిగిన ముత్యంలా ఉన్నాడతడు.
తమ కళ్ళనుతామే నమ్మలేకపోయారు వారు.
నెమ్మదిగా కళ్ళుతెరిచిన శ్రీకృష్ణుడు ఉదయభానునిలా తన చుట్టూ పరికించి చూసి, ‘‘రాధా!...రాధా!....’’యని పలవరిస్తూ-
‘‘ఏదీ నా రాధ? అంటూ సుడిగాలిలా సుడులు తిరుగుతూ అటూ, ఇటూ పరుగులెత్తాడు. వాళ్ళని పరిపరి ప్రశ్నించాడు.
ఏంచెప్పాలో, ఏం చెప్పకూడదో తోచలేదు వాళ్ళకి. వౌనం వహించారు వారు.
కానీ, ఒక రుక్మిణి మాత్రం సాహసించింది. ఆతని దరిజేరి, వినయ విధేయతలతో, భక్తిప్రపత్తులతో చేతులు జోడించి...
‘‘నేను చూశాను ప్రభూ మీ రాధని!...ఇప్పుడే, ఇలావచ్చి వెళ్ళింది! మీరు ధ్యానంలో ఉన్నారు. మీచుట్టూ తిరిగింది. మీ లలాటాన్ని ముద్దెట్టుకుంది. మీ మూర్ఖాన్ని స్పృశించింది. మీపై అపార కరుణావృష్టిని కురిపించింది. తన దివ్యదర్శనాన్ని మాకూ సంప్రాప్తింపజేసింది. మమ్మల్ని పునీతుల్ని చేసింది. ఎలా వచ్చిందో మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది. అంతర్థానమైపోయింది. ఐనా, మేము మీలో మీ రాధని చూడకలుగుతున్నాం ప్రభో!’’...అంటూ ఆనందాశ్రువుల్ని రాల్చింది రుక్మిణీ దేవి.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087