Others

ఆమె అస్తిత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ మాసాల గండం నుంచి
గట్టెక్కిందో లేదో
నిమిషం నిమిషం
మృత్యుద్వారం ముందు
ఎదురుచూపులు

ఆడపిల్లగా పుట్టడమే
శాపమైన దేశంలో దినామూ
వొక సంఘర్షణే

ఎదిరే సీతాకోకచిలుకని
కబళించడానికి ఎన్ని చేతులో
లాఘవంగా తప్పించుకుని
ఎదిగిన క్రమం కష్టమే
యవ్వనాన్ని దాచలేని
శరీరంతో రాక్షస ప్రేమల నుంచి
రక్షించుకోవడం
కత్తిమీద సామే కదూ

చదువులనుంచి క్రీడలు
వ్యవసాయం నుంచి అంతరిక్షం దాకా
బతుకుకోసం పోరాటం

తన బతుకుకి విలువ ఇవ్వని
నిర్దయ ప్రపంచంతో
అస్తిత్వం కోసం
తరతరాలుగా కొట్లాడుతూనే ఉంది

పితృస్వామ్య పంజరం
విడుదలకోసం
వొకటే యుద్ధం
తానుగా కోరుకోని
యుద్ధమిది

లింగబేధాలతో ఓడిపోతూ
తనని తాను గెలవడానికి
ప్రతీ క్షణం తపన పడుతూ

మూఢనమ్మకాల చీకటి దారులని
చీల్చుతూ తానొక వెలుగు కాగడా

ఆడవాళ్లు ఏమి చేయగలరన్న
అపవాదుకి కాలం చెల్లింది

ఇప్పుడు ఆమె
తన అస్తిత్వాన్ని సగర్వంగా లోకం
ముందు నిలబెట్టుకుంది
ఇక అంతా మహిళావరణమే!

- పుష్యమీ సాగర్ 9010350317