Others

పసితనం నుంచే శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేసరికే బాలికలకు ఈ వేటలో శిక్షణనివ్వడం మొదలుపెడతారు. శిక్షణ కూడా అత్యంత కఠినంగా ఉంటుందట. అలా సుమారు ఏడేళ్లపాటు వారికి వేటలో వెళకువలను నేర్పించి, అప్పటికే అనుభవం సంపాదించిన మహిళల నేతృత్వంలో శిక్షణ ఇచ్చి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి వారిని వేటకు పంపిస్తారు.
నీటిలో తేలే విధంగా వుండే అమరికలతో కూడిన బుట్టలు, వలలు పట్టుకొని కన్నుమూసి తెరిచేసరికి అత్యంత లాఘవంగా, వేగంగా సముద్రపు లోతుల్లోకి వెళ్లి అక్కడ రకరకాల సముద్ర జీవులను, ముత్యాలను సేకరించి మళ్లీ అంతే లాఘవంగా ఒడ్డుకు చేరుకుంటారు. ఇదంతా కేవలం రెండు మూడు నిమిషాల్లోనే జరిగిపోతుంది. కాస్త ఊపిరి పీల్చుకొని మళ్లీ సముద్రపు లోతుల్లోకి ఉరుకుతారు. ఇలా దాదాపు నాలుగు గంటలు వేటాడి, తాము సేకరించిన సంపదనంతా ఒక చోట చేర్చుకొని, అపుడు అందరూ కలిసి సముద్రపుటొడ్డున మంటను వేసుకుని తమ శరీరాన్ని, బట్టలను వేడిచేసుకొని సేద తీరుతారు. ఆహారాన్ని పంచుకొని తింటారు.