Others

మా వూరు మదరాసు.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావూరు మదరాసు/ నా పేరు రామదాసు -అంటూ కొసరాజు రాఘవయ్యచౌదరి రాసిన పాటంటే నాకు చాలా ఇష్టం. దేవత చిత్రం కోసం గాయని ఎల్‌ఆర్ ఈశ్వరితో కలిసి నటుడు పద్మనాభం స్వయంగా పాడిన పాట ఇది. కామెడీ ట్రాక్‌లో రికార్డు చేసినా -పాట మంచి హుషారుగా వైవిధ్యంగా సాగడమే కాదు, సినిమాకు ఓ మంచి హిట్ సాంగ్‌గా నిలిచింది. పద్మనాభం సొంత బ్యానర్ రేఖామురళీపై దేవత చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పద్మనాభానిది కామెడీ పాత్రే అయినా -హీరో యన్‌టి రామారావు తరువాత రెండో హీరో మాదిరి ఎక్కువ నిడివివున్న పాత్ర. జోడీగా నటించిన గీతాంజలి -పద్మనాభంపై ఈ పాటను చిత్రీకరించారు. సినిమాలో ఈ పాటను చిత్రీకరించిన విధానం చూస్తూ -్భలే ఉంటుంది. గీతాంజలి వేషధారణ, ఎండకు గొడుగుపట్టుకుని పట్నపు పిల్లలా పరిచయం, హుషారైన స్టెప్పులు, మద్రాస్‌లోని ఓ అందమైన పార్క్‌లాంటి లొకేషన్‌లో చిత్రీకరించిన విధానం -ముచ్చటేస్తుంది. పాటకు బాణీ సమకూర్చిన సంగీత దర్శకుడు యస్పీ కోదండపాణి ప్రతిభ ఈ కామెడీ పాటలోనూ కనిపించటం విశేషం. యస్పీ కోదండపాణే -యస్పీ బాలును గాయకుడిగా చిత్ర రంగానికి పరిచయం చేశారు. పద్మనాభం సొంతదైన రెండో చిత్రం శ్రీశ్రీశ్రీ మార్యదరామన్న చిత్రం ద్వారా ఆ పరిచయం జరిగింది. ఇక దేవత చిత్రంలో పద్మనాభంపై మూడు పాటలుంటాయి. కోదండపాణి ‘దేవత’ చిత్రానికి అన్ని పాటలను సుస్వరాలతో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చారు. సినిమా పిచ్చివున్న పద్మనాభం హీరోకావాలనే కోరికతో సినిమా నిర్మాత, దర్శకులు, నటీనటులను కలుసుకోవటం, తన టాలెంట్ నిరూపణలో సినిమాలో వచ్చే సన్నివేశాలు మంచి హాస్యంతో కడుపుబ్బ నవ్విస్తాయి. తనకెంతో ఇష్టమైన తన మేనమామ కూతురైన మరదలితో కలిసి పాడుకొనే ప్రేమగీతం ఇది. ‘దేవత’ చిత్రంలోని బరువైన విషాద సన్నివేశాల మధ్య వచ్చే పద్మనాభం ప్రేమగీతాలు, హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. తర్వాత పద్మనాభం తను హీరోగా సొంత బ్యానర్‌పై చిత్రాలు నిర్మించుకుంటూ వచ్చారు. ఇది కామెడీ పాటే అయినా కొసరాజు సాహిత్య విలువలతో ఈ గీతాన్ని ఆవిష్కరించారు. అందుకే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.

-శివప్రసాదరావు, అద్దంకి