Others

ఒక రిస్కు.. రెండు విజయాలు (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి కడుపునుంచి బయటపడింత్తర్వాత -బిడ్డ ప్రయాణమెటో? కన్న తల్లి కూడా చెప్పలేదు. కానీ, ఆ తల్లి కడుపున ఆ బిడ్డను వేస్తూనే -వాడి తలరాత గ్రాఫ్‌ను డిజైన్ చేసినవాడొకడుంటాడు. ఆ విషయమూ మనిషికి ముందు తెలీదు. జీవితానికి అర్థం తెలిసిన తరువాతే -ఆ గ్రాఫ్‌ను డిజైన్ చేసిన వాడి అడ్రస్ దొరుకుతుంది. ఆ లైఫ్ డిజైనరే -సంకల్పమూర్తి. తరచి తరచి చూస్తే వాడి రూపాన్నీ చూడొచ్చు. కాకపోతే తేరిపార చూసినపుడు అక్కడ కనిపించేది మాత్రం చూసేవాడి -ప్రతిరూపం.
తెరమీద- అనేకమార్లు అనేక సినిమాల్లో అనేకనేక పాత్రల్లో పరిపరివిధాల కనిపించినా -ఈయన పేరు ఇప్పటికీ చాలామందికి తెలీదు. అంతెందుకు పరిశ్రమలోనే చాలామందికి ఈయన పేరు తెలీకపోవచ్చు. కానీ, ఆయా పాత్రల్లో ఆయన్ని చూసినపుడు మాత్రం -ఈయన నాకెందుకు తెలీదు? అన్న భావన మాత్రం మనసును కమ్ముకుంటుంది. సౌహార్థుడిగా, కఠినాత్ముడిగా, మంచివాడిగా, చెడ్డవాళ్లలో ఒకడిగా.. ఇలా స్క్రీన్‌మీద తన కళా ప్రతిభను ప్రదర్శించిన ఈయన పేరు భీమేశ్వరరావు. ఈ వారం ‘వెనె్నల’ ముచ్చట్లకు ఈయనే అతిథి.
*
ఆరోజూ... ఈరోజూ... ఏరోజైనా సినిమా నిర్మాణం ఓ సాహసోపేత నిర్ణయమే! రిస్కే!
గిరిబాబు సినిమా తీస్తున్నాడన్న వార్త గుప్పుమంది. రంగనాథ్ నేనూ మంచి స్నేహితులం- రంగనాథ్, గిరిబాబూ మంచి స్నేహితులు. ఆ రోజుల్లో సినిమా కుటుంబంలో జర్నలిస్టూ ఓ ప్రధాన పాత్రధారి. సాయంత్రంవేళ ఆఫీసు బయట కుర్చీలు వేసుకొని... అందరం మనసు పంచి మాట్లాడుకునే వాళ్లం. నిజానికి గిరిబాబు ప్రొడక్షనులో అడుగుపెట్టడం ఎవరికీ ఇష్టంలేదు. ఎందుకంటే డైరెక్టరు కొమ్మినేని శేషగిరిరావు. అది అతనికి తొలి అవకాశం. హీరోలు అయిదారుగురు రంగనాథ్, మురళీమోహన్, గిరిబాబు, హరిబాబు, మాదాల రంగారావు, ఇంకెవరో పేరు గుర్తులేదు. హీరోయిన్ ప్రభ. కథ నాగుపాము ప్రధానంగా సాగుతుంది. అప్పటికే ఏవియం వారి నోము చిత్రం నాగుపాము ఆధారంగా తీసి సూపర్‌హిట్ అయ్యింది. ఒకవేళ ‘నోము’ ఫెయిలయినా అది ఏవియం తట్టుకోగలదు. మరి గిరిబాబు భవిష్యత్తు? ఇదే ఆలోచన... అందరి ఆలోచనా గిరిబాబు మరోసారి ఆలోచించుకోమనే- అపుడు గిరిబాబు చెప్పిన సమాధానం మరిచిపోలేను. ‘ఆలోచనైతే మార్చుకోగలను. కానీ ఇది నిర్ణయం, మార్చుకోలేను. లాభమో నష్టమో వెనకడుగువేసే ప్రసక్తేలేదు అన్నాడు.
ఏవియం స్టూడియో ఎయిత్ ఫ్లోర్‌లో పెద్ద సెట్టు. ఆ సెట్టులో షూటింగు. కొమ్మినేని కిందామీదా పడుతున్నాడు. అప్పటికే ఆయన గొంతుపోయింది. నటీనటులంతా సమవయస్కులు గనుక ఆడుతూపాడుతూ షూటింగు సాగిపోతోంది. టైటిలు ‘దేవతలారా...దీవించండి!’. నిజానికిది ఇప్పటిరోజుల్లో అయితే చిన్న టైటిలే. అప్పట్లో ఇంత పెద్ద టైటిలా... అని పెదవ్విరిచిన వాళ్ళూవున్నారు. ఈ సినిమాకి సంగీతం చక్రవర్తి. (శేషగిరిరావు అన్నయ్య). పాటలూ బ్యాగ్రవుండ్ స్కోర్ విషయంలో ప్రాణంపెట్టిమరీ చేశాడు.
ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్సు లేకుండా సినిమా చేశాడు. ప్రివ్యూ చూడ్డం జరిగింది. చూసినవాళ్ళంతా బావుందన్నారు. మద్రాసులో సినిమా బావుందన్నా నమ్మడానికి లేదు. అన్నీ ముఖస్తుతి మాటలు. తారకరామా కేశవరావనుకుంటాను డిస్ట్రిబ్యూటరు. సినిమా రిలీజ్ చేశాడు. మొదటిరోజు అంతంతమాత్రంగా వుంది. శని, ఆదివారాలు హవుస్‌ఫుల్స్ అయ్యాయి. అయినా నమ్మకంలేదు. సోమవారం వరుసగా అన్ని ఆటలూ హవుస్‌ఫుల్స్ ఆడాయి. టోటల్‌గా రెండవ వారం గడిచేసరికి సినిమా హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. కథ సుఖాంతం అనుకున్నాం. అక్కడితో ఆగాడా!
యన్‌టిఆర్ హీరోగా సింహబలుడు సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో అప్పటికి ఇండస్ట్రీలో మేటి సెట్టింగువేసి చేస్తున్నారు. ఆ చిత్రానికి కథ రాఘవేంద్రరావు, సత్యానంద్ ఆ టీమ్.
గిరిబాబు స్వీయ కథతో స్వీయ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో కృష్ణ ప్రధాన పాత్రధారి ‘సింహగర్జన’ అనౌన్స్ చేశాడు. ఈ వార్త ఇండస్ట్రీలో గుప్పుమంది. పులిని చూసి నక్కలు వాతలేసుకోవడమా? అనుకున్నారు కొందరు సినిమా పెద్దలు. సినిమా నిర్మాణం జరుగుతున్నంతకాలం రోజుకో వింత విశేషాలతో వార్తలు వచ్చేవి. యన్టీఆర్ సినిమా ‘సింహబలుడు’కి అన్ని అడ్వాంటేజెస్సే!. గిరిబాబు సినిమాకి అన్ని డిసెడ్వాంటేజెస్సే.
దేవతలైతే దీవించారు గాని... సింహబలుడు ముందు సింహం గర్జిస్తుందో తుస్సుమంటుందో అనుకుంటూ మూతులు కొరుక్కున్నారు.
గిరిబాబులో ప్రత్యేకత ఏవిటంటే.. ఎంతమంది ఎన్ని కామెంట్లుచేసినా.. ప్రశంసించినా.. ఒకపక్క బడ్జెట్ పెరిగిపోతున్నా పట్టించుకోలేదు. అంకితభావంతో తనపని తాను చేసుకుపోయాడు. సినిమా రిలీజుకి ముందు మానసికంగా చాలా టెన్షనుపడ్డాడు. ఆర్థిక సమస్యలేకాదు అనవసరమైన సమస్యలతో తలబొప్పికట్టేది. అయినా మొక్కవోని విశ్వాసంతో వున్నాడు. ఆ సమయంలో హీరో కృష్ణ ఇచ్చిన మోరల్ సపోర్టు చాలా గొప్పది.
రెండు సినిమాలూ ఒకేసారి రిలీజయ్యాయి. రెండు సినిమాలకూ మంచి టాక్ వచ్చింది. నిజానికి ‘సింహగర్జన’ చిత్రంలోనే కథ బిగువూ, పాత్రల పొదుగూ ఆద్యంతమూ రక్తికట్టించింది. అపుడు నేనే రివ్యూ రాశాను. ‘సింహబలుడు ముందు సింహం గర్జించింది’ అన్నాను. నిజానికి ఆ సినిమాలోవున్న కథాకథనాలూ- సాంకేతిక విలువలూ అటువంటివి.
ఇప్పటికీ గిరిబాబును కలిసినపుడు ఆ విషయాలు గుర్తుకి తెచ్చుకుంటాం. ఇటీవల కలిసినపుడు.. దేవతలు దీవించారు. సింహం గర్జించింది- ‘నీ సుఖమే నే కోరుతున్నా’ తీశారు. ‘ప్రేక్షకులు మీ సుఖం కోరుకోలేదు’ అన్నాను. అందుకాయన సమాధానం అక్షరసత్యం!
‘అప్పట్లో నిర్మాత అనుకున్నది అనుకున్నట్లు తీసేవాడు. అందుకు సాటి నటీనటులూ, సాంకేతిక నిపుణులూ సహకరించేవారు. ఇప్పుడా పరిస్థితుల్లేవు. అందరూ పనిగంటలు లెఖ్ఖపెట్టుకుంటున్నారు. గుండెనిండా వూపిరి పీల్చుకొని పనిచేద్దామన్న ఆ సమయం వృధా అయిపోతుందన్న భయం. భయంతో ఏం చెయ్యగలం చెప్పండి. గడిచిన రోజులన్నీ మంచిరోజులని... ఆరోజుల్ని తలచుకొని తృప్తిచెందటం తప్ప ఇప్పట్లో చేయగలిగిందేం లేదు అన్నాడు గిరిబాబు.
ఇది అందరికీ వర్తిస్తుందేమో!

-ఇమంది రామారావు 9010133844