Others

ప్రశ్నతోనే సత్యం వెలుగు చూస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
అన్ని వివరాలు- ఎటు వెళ్ళాలో తెలిపే పటాలు, ఎప్పుడు ఎలా చెయ్యాలో తెలిపే పుస్తకాల ద్వారా అన్ని వివరాలు- తెలిసిన తరువాత, వాటి ఆధారంతో అతడు ధైర్యంగా అడుగు ముందుకువేస్తాడు. అంతేకానీ, ఏ వివరాలు తెలియకుండా తెలియని దానిలోకి అడుగుపెట్టేందుకు అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉండడు. కానీ, జీవితం ఎలా సాగుతుందో ఎవరికీ వివరంగా తెలియదు. ఎందుకంటే, జీవితం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. అందువల్ల దాని గురించి ఎవరుమాత్రం ఏమి చెప్పగలరు?
ప్రతి క్షణం ‘‘ఇప్పుడే’’అన్నట్లుగా ఉంటుంది. అందుకే ప్రతిక్షణం కొత్తగా ఉంటుంది. సూర్యుని వెలుగులో పాతది అనేది ఎక్కడా ఉండదు. ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. అందుకే అది ఒక అద్భుతమైన ‘‘గతిశీలత’’ అని నేనంటాను.
కేవలం మార్పుచెందడమొక్కటే ఎలాంటి మార్పుకు లోనుకాకుండా జరిగే నిరంతర శాశ్వతప్రక్రియ. మార్పుచెందడమొక్కటే ఎప్పుడూ మారని విషయం. జీవితంలో ప్రతిదీ నిరంతరం మారిపోతూనే ఉంటుంది. ఆ మార్పును పటాలు, పుస్తకాల ద్వారా ఎవరూ ముందుగా తెలుకోలేరు. స్థిరంగా ఉండే వాటి వివరాలు మాత్రమే పటాలు, పుస్తకాలు ఇవ్వగలవు. కానీ, జీవితం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నిరంతరం మార్పుచెందే అద్భుతమైన ప్రక్రియ. దాని గతిశీలతను ఎవరూ తెలుసుకోలేరు. అదే దాని మర్మం. కాబట్టి, ముందుగా సిద్ధంచేసిన పటాలు, పుస్తకాలవల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే, జీవిత గమనం అన్ని దారులను మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి, పటాలు, పుస్తకాలు సిద్ధమయ్యే సమయానికి వాటి కాలంచెల్లిపోతుంది. అందువల్ల అవి ఎందుకూ పనికిరాకుండాపోతాయి.
కాబట్టి, జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పుడూ అడగకండి. ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండా, ఏమాత్రం భయపడకుండా, చాలా ధైర్యంగా జీవితాన్ని యధాతథంగా స్వీకరించగల దార్శనికతనే నేను ‘‘మానసిక పరిపక్వత’’ అంటాను.
ప్రపంచంలోని చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, దేవాలయాలన్నీ నకిలీ ధార్మికులతో నిండిపోయాయి. అందుకే ప్రపంచంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది. ఈ సంగతి మీకు తెలియట్లేదా? ఒకవేళ, నిజంగా, వారందరూ ధార్మికులే అయితే, ప్రపంచంలో అవినీతి ఇంతగా ఎందుకు తాండవిస్తున్నట్లు? ఎందుకంటే, మతాలలో ఉన్నవన్నీ తప్పులు, అవాస్తవాలే. అవి ప్రజలకు విశ్వాస విధానాలు నేర్పాయి కానీ, స్వయంగా ఎలా తెలుసుకోవాలో నేర్పలేదు. అక్కడే మానవాళి తప్పటడుగు వేసింది. అందుకే ఆ మతాలు నేర్పిన విశ్వాస విధానాలు మూఢనమ్మకాలుగా పరిణమించాయి.
ఎప్పుడూ నమ్మకండి. సందేహించడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల ఏదో ఒకరోజు మీకు నమ్మకం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే, సందేహాలతో మీరు సుఖంగా, శాశ్వతంగా జీవించలేరు. సందేహించడం ఒక రోగం. అది ఉన్నంతకాలం మీరు సుఖంగా ఉండలేరు. ఎందుకంటే, దానివల్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక అనేక అవస్థలు పడతారు. కాబట్టి, ఏదో ఒకరోజు మీరు దానినుంచి బయటపడాలని కోరుకుంటారు. అది మంచిదే అని నేనంటాను. ఎందుకంటే, నకిలీ ఆస్తికుడుగా ఉండడంకన్నా నాస్తికుడుగా ఉండడమే మేలు.
దేవుడిని, ఆత్మను, ఇంకా అలాంటి అనేక విషయాలను గుడ్డిగా ఎలా నమ్మాలో మీకు మీ పసితనంనుంచే నేర్పారు. అలా మీ మనసును పూర్తిగా నిబద్ధీకరించారు.
*
- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.