Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరే కాదు విశ్వమ్మే- నేరబోదు మా బంధం
ఎవరికి తోచిన విధాన- వారె చెప్పుకొందురు

కనబడదది కన్నులకు- వినబడదది వీనులకు
అది విచిత్రవౌ బంధం- అర్థవౌను ఆత్మకు

ఎక్కడిదీ రాగమనని ఏమి తెలుపు మురళి?
ఎక్కడిదీ పరిమళమన ఏమి తెలుపు సుమము?

ఎటుల ఎగురగలుగుదన్న- ఎటుల తెలుపు విహంగం?
ఎటుల ఈదగలుగుదన్న- ఎటుల తెలుపు మీనం?

నా కన్నుల నడగండీ! నా వేణువు నడగండీ!
నా ఊపిరి నూపిరులై- నాగుండియ నడగండీ!

తల్లి ఒడినిజేరి శిశువు- తల్లితోడ ఆడుకొనుచు
తల్లికొరకు ఏడ్చినట్లు- తల్లీ! మీ ఆవేదన!

అందులకే మీరిప్పుడు వేసినారు ప్రశ్నలను!
చెప్పలేక, తప్పుకొనక ప్రార్థించితి రాధను!

కనపడమని, వినపడమని, బదులు నీవె చెప్పమని!
నా మాటను ఆలకించె! నా ప్రార్థన మన్నించె!

ననె్న కాదు మిమ్ము కూడ- కటాక్షించె నోరుూ!
తానెవరో నేనెవరో - తెలియపరచె నోరుూ!

ఒక దృశ్యం వేనవేల పుటల సమాధానం!
ఒక తొలకరి జల్లు పెక్కు అనుభూతుల జల్లు!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087