Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూచితిరే మా బంధం? చూచితిరే అనుబంధం?
విశ్వమ్మేలెడి శక్తిని విప్పి చెప్పతరమే?

ఏనుగుపై తిరుగాడెడి చీమ నడుగ చెప్పునే?
తానేమో తెలియబోదు ఏనుగునెటు వర్ణించును?

నే కాయము నామె యాత్మ- నే గుండియ తానూపిరి!
నే జీవిని ప్రాణమామె! నను నడిపే దేవత!

‘‘రాధా! రాధా’’! యటంచు చేతులెత్తి నేను!
‘‘కృష్ణా! కృష్ణా! యటంచు నను జేరును తాను!

లోకాలనె దాటివచ్చు నా కోసమె తాను!
ఆమె కొరకు నిరీక్షణమె నాకు జీవితమ్ము!

పారావారమును జేర ‘బిరబిర’మని సాగును నది
ఇది నిత్యవ్మౌ సత్యం! జగమెరిగిన సత్యం!

కాని నేను నది నౌదును! ఆమె యొక్క కడలి
కాని కడకు నాకడకును కదలి వచ్చు కడలి

గగన శిఖరమందుండెడు గంగ కాంతి వేగమ్మున
గరళకంఠు శిరముపైకి చేరినట్లు ‘‘బిరబిర’’మని

నను జేరును నా రాధిక!
నను బ్రోచును నా రాధిక!

నా భాధయె రాధ సుమా! నా గాథయె రాధ సుమా!
నా ఊపిరులామె సుమా! నాజేతమ్మామె!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087