Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమున్నది తెల్లతెల్లగ తెల్లవారుచున్నది.
కనిపించడు శ్రీకృష్ణుడు! కనుపింపరు చెలియలు!

ఎటుచూచిన ఆకులె! పూరేకులె! పుప్పొడులే!
రాలి రాలి రేతిరంత రాశులుగా మారెను!

ఏమాయెనొ ఏ మాయనొ? ఎవరెత్తుకుపోయిరొ?
ఏమైరో వెలదులంత? ఏ మూలను దాగిరొ?

అనుచునామె కలత చెంది
వెదకె నన్నిదెసల

ఇంతలోనె ఒక చల్లని మారుతమ్ము వీచెను
గాలితోడ మరులు గొలుపు పరిమళమ్ము పూచెను

ఆకులన్ని రెక్కసాచి ఆకసానికెగిరెను
పూవులన్ని వానివెంట జంటలుగా సాగెను.

చిత్రముగా చిత్రమ్ముల వలె చెలియలు కన్వట్టిరి
భువికి దిగిన సప్తవర్ణ హరివిల్లులవలె తోచిరి

చెలియల మధ్యన చెలియలు!
చెలియల చుట్టును చెలియలు!
ఎటుచూచిన నటు చెలియలె!
కనిపింపడు చెలికాడె!

అటు నిటు పరువెత్తినారు! అడివంతయు వెదకినారు!
అటుగానక నిటు గానక- అతివలెంతొ కుందినారు!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087