Others

శివపానవట్టంపై నరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహ ముహూర్త సమయంలో పేటిక తెరచి, భయంకర సర్పమును గాంచి, జరిగిన మోసమును గ్రహించి, వచన బద్దురాలై, రాకుమారి పామునే తన భర్తగా స్వీకరించెను. ఆ సర్పమును కంఠమున ఉత్తరీయము వలె ధరించి, భగవదనుగ్రహమునకై తీర్థయాత్రల కేగి, పుణ్య క్షేత్రములను తిరుగుతూ, దండకారణ్యమందలి పుణ్యభూమి యగు ధర్మపురికి ఏతెంచారు.
పవిత్ర గౌతమీ జలాలలో సర్పముతోకూడి స్నానమాచరించెను. తక్షణమే సర్పము దివ్య పురుషునిగా మారెను. ప్రజలందరి సంశయమును తీర్చి, పాతివ్రత్య నిరూపణకై, మూడు ముష్ఠుల ఇసుకను పిడికిలితో పోయగా, ఆప్రదేశమందు సైకతము ఇసుక స్థంభముగా మారెను. రాజకుమారి విజయ ‘‘సత్యవతి’’యని పాతివ్రత్య మహిమకారణంగా సార్థక నామధేయురాలు కాగా, ఆ మహాసాధ్వి స్నాన మాచరించిన స్థలము ‘‘సత్యవతీ కుండము’’ అని నామాంకితయయ్యెను. అనంతర కాలంలో, సత్యవతీ కుండములో స్నాన మాచరించి, ఆమె దర్శనం చేసుకుని, స్థానిక ఇలవేలుపైన శ్రీనృసింహుని మందిరానికి వెళితే, ఒక్కొక్క పాదమున ఒక్కొక్క అశ్వమేధ యఙ్ఞ ఫలం లభించునట్లు వరములు పొందెనని స్థల పురాణాలు స్పష్టం చేస్తున్నాయి
ఇక చారిత్రిక అంశానికొస్తే స్థానిక ఓరియంటల్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, చారిత్రక పరిశోధకులు, బహుభాషావేత్త డాక్టర్ సంగనభట్ల నర్సయ్య చారిత్రిక పరిశోధనల ఫలితంగా ఇది అపురూపమైన ‘‘హరిహరనాథ ఆలయం’’గా భావించబడుతున్నది. శివ, కేశవులకు అభేదాన్ని పాటించే హరిహర క్షేత్రంలోని ఈఆలయంలో భారతదేశంలో వేరెచ్చటనూ కానరాని విధంగా ‘‘పానవట్టం మీద నారసింహుని విగ్రహం’’ ఉండడం విశేషం. 11వ శతాబ్దికి చెందిన ఈ ఆలయం మొదట శివాలయమని, తరువాత నారసింహాలయమని, ప్రస్తుతం సత్యవతి ఆలయమని డాక్టర్ నర్సయ్య పరిశోధన ద్వారా తేల్చి చెప్పారు. ఇక్కడి స్థంభం చాళుక్యుల కాలంనాటి విజయస్థంభమని భావన. ఆరు అడుగుల ఎత్తుగా వితర్ధిక కట్టి, దానిపై ఆలయం నిర్మితమైంది. ఆలయ గర్భంనుండి కప్పును చీల్చుకుని అత్యంత ఎత్తుగా నిలిచిన స్థంభమునానుకునే పానవట్టం, దానిపై లింగం స్థానంలో నరసింహుని విగ్రహం ఉంది. దీని పక్కగా పడగ నీడలో లక్ష్మీనారాయణ విగ్రహం ఉంది. కుడిపక్కన నూనె కారుతున్నంత నునుపుగా అమ్మవారి విగ్రహం ఉంది. ఆళ్వారుల విగ్రహాలూ ఉన్నాయి. ఆలయ ప్రవేశంలో రెండు ఆంజనేయస్వామి విగ్రహాలు ఎదురెదురుగా ఉన్నాయి. ద్వారబంధంపై శేషసాయి విష్ణుమూర్తి విగ్రహముంది. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన సత్యవతీ ఆలయం తదంతర్గత ఇసుకస్థంభం, ఆలయంలోని అరుదైన విగ్రహాలు ప్రస్తుతం ఆదరణలేక శిథిలావస్థకు చేరుకున్నాయి. బ్రహ్మపుష్కరిణి (కోనేరు)కి నైరుతి భాగాన, పట్టణం నడిబొడ్డున, ఎత్తయిన ప్రదేశంలోగల సత్యవతీ ఆలయాన్ని, రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీన పరుచుకుని, శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధంగా జేసి, ప్రత్యేక నిధులతో, క్షేత్ర ప్రాధాన్యతను ఇనుమడింప జేస్తూ, సనాతన ఆలయాలను పునరుద్దరించే చర్యలు గైకొనాలని, అందులకై దేవాదాయ శాఖ తక్షణం స్పందించాలని, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులకై తగు కృషి సల్పాలని, ఆలయ జీర్ణోద్ధరణ పనులను వెనువెంటనే చేపట్టే చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్త కంఠంతో విఙ్ఞప్తి చేస్తున్నారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494