Others

నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
కృతిని
ప్రకృతిని
ప్ర‘కృతి’ని

నేను
కుడిఎడమల అర్ధాంగిని
రహస్యకేళి విన్యాసాన్ని
దశమ అవతారగర్భను.

నేను
మానవగర్భను
ఆజన్మ విశ్వగర్భను
నవమాస సృష్టిగరిమను

నేను
సంసార సారధిని
సారధ్య సన్యాసాన్ని
నిశ్శబ్ద సాత్వికాన్ని

నేను
ఉమ్మడి సౌఖ్యాన్ని
కుటుంబ ధ్యానకలశాన్ని
సకుటుంబ కర్మకౌశలాన్ని

అయినా, నేను
ఏకాంతవాసిని
జంటలోని ఒంటరిని
ఒంటరితన ఏకాంతాన్ని

నేను
లోకమాన్యాన్ని
ఆలోకనా కర్మిష్టిని
లోక అలోక కౌశలాన్ని

నేను
గర్భస్థ మంత్రాన్ని
విశ్వకుండలిని తంత్రాన్ని
సహస్ర మండల
పారవశ్యాన్ని

నేను
సృష్టికర్త ప్రమోదాన్ని
స్వరకర్త రసజననిని
విశ్వకర్మ పురిటిగడ్డను

నేను
ప్రణయమూర్తిని
ప్రళయమూర్తిని
ప్రణవమూర్తిని

-డా.వాసిలి వసంతకుమార్