Others

మొదటి డోలు బృందం వీళ్లదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా డోలు వాయిద్యాలను పురుషులే ఎక్కువగా వాయిస్తుంటారు. ఎందుకంటే దీనికి బలం చాలా అవసరం.. కానీ గోవాకు చెందిన ఈ మహిళలు ఆ సాంప్రదాయాన్ని తిరగరాశారు. వీళ్లు సొంతంగా ఓ బ్యాండు మేళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సభ్యులందరూ మహిళలే.. గోవా రాష్ట్రంలో వీరికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దాంతో వివాహ కార్యక్రమాలకు, ఇతర ఉత్సవాలకు రాష్ట్రంలో చాలామంది వీరినే పిలుస్తున్నారు. తాజాగా దిల్లీలోనూ ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చారు. ప్రస్తుతం గోవా రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచీ తమకు ఆహ్వానాలు వస్తున్నాయని ఈ బ్యాండు మేళం సభ్యులు చెబుతున్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు సాఫీగా సాగుతోందని అంటున్నారు. ఈ బృందంలోని సభ్యులు మాట్లాడుతూ.. ‘గతంలో ఇలాంటి వాయిద్యాలను పురుషులు మాత్రమే వాయించేవారు. మహిళలు వాయించడం ఇదే తొలిసారి. ఇది మేము సాధించిన గొప్ప విజయం. గోవాలో చాలాచోట్లకు వెళ్లి డోలు వాయించాం. ఇప్పుడు దేశ నలుమూలల నుంచీ మాకు ఆహ్వానాలు వస్తున్నాయి’ అని ఒక సభ్యురాలు చెప్పింది.
‘ఇలా డోలు వాయిస్తానని నేను ఎన్నడూ ఊహించలేదు. గతంలో నేను కనీసం డోలును తాకనైనా లేదు. అయినా ఇప్పుడు ఎంతో బాగా డోలు వాయించగలుగుతున్నాను’ అని మరో మహిళ చెప్పింది.
‘నేను డోలు వాయిస్తూ దేశమంతా తిరుగుతున్నాను. నా పిల్లలను ఇంట్లో మా అత్తమ్మ చూసుకుంటారు. ఇలా ఉత్సవాలకు వెళ్లడానికి నా భర్త నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను దిల్లీ వంటి పలుచోట్ల ఉత్సవాలకు రాగలిగాను. అందరూ మేము డోలు వాయిస్తుంటే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా నృత్యాలు చేస్తున్నారు. మాకు ఈ విషయంలో కావలసినంత స్వేచ్ఛ ఉంది’ అని బృందంలోని మరో సభ్యురాలు తెలిపింది. ఇలా డోలు వాయించే బృందంలోని సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పరికరాలను పురుషులు వాయిస్తున్నప్పుడు మేమెందుకు వాయించలేం? మాకేం తక్కువ? అంటూ వారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు?