Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతలోనె వినిపించెను వింతగ మురళీరవమ్ము
ఇంతుల చేమంతి ముఖములంత లేసినాయెను

కొమ్మలలో రెమ్మవోలె రెమ్మమాటు కోకిలవలె
కోకిలవలె పోకిరివలె కొంటె కృష్ణుడగుపించెను.

కృష్ణపత్నులు:
ఏమిటోయి ఈ ఆటలు? ఏమిటి ఈ పాటలు?
మా తోడనె ఆటలా? ఆటలె సయ్యాటలా?

రేతిరంత కలలలోన ఎటనెటనో తిరిగితిమి
అందమైన లోకమ్ముల ఆనందమునందితిమి

కలయో అది కలవరమో! కాక నీదు లీలలో
ఎటు తెలియకనున్నది! మాకెటు తోపక నున్నది

ఒక ప్రక్కన శ్రీరాముడు- ఒకవైపున శ్రీకృష్ణుడు
ఒక చెంపన సీతమ్మ- ఒక వంకన సత్య

ఏమిటోయి కన్నయ్యా! ఏమిటి ఈ లీలలు
ఎరుగలేము మేమెవరమొ! ఎరుగము నీవెవరవో!

కృష్ణుడవై కనిపింతువు! రాముడవై రమియింతువు!
రాముడెవరొ? కృష్ణుడెవరొ? రాముండే కృష్ణుండో?

సత్య ఎవరొ? సీత ఎవరొ? సత్యయె సీతమ్మొ?
తెలుపుమోయి! మా కన్నుల- తెరిపించగలదోరుూ!
అనుచువారు అతనిజేరి అభ్యర్థించేరు
రహస్యావిష్కరణం
శ్రీకృష్ణుడు:
నేనే రాముడనోరుూ! నేనే కృష్ణుడును!
సత్యయె ఆనాటి సీత! సత్యమీమాట!

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087