AADIVAVRAM - Others

చెప్పలేని ఆ హాయి.. ఎక్కడ ఉందోయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చిటపట చినుకులు పడుతూ వుంటే
చెలికాడే పక్కన వుంటే
చెట్టాపట్టగ చేతులు కలిపి
చెట్టునీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో
వెచ్చగ ఉంటుందోయి’ అన్నారో
మనసు కవి మనసారా ‘ఆనాడు’
నీడనిచ్చే చెట్టెక్కడుంది?
గొంతు తడిపే చినుకెక్కడుంది?
చెప్పలేని ఆ హాయి ఇంకెక్కడుంది - నీడ
‘్ధనమేరా అన్నిటికీ మూలం’
అన్న భావన నరనరాన నరునికి
జీర్ణించుకుపోయి చెట్లను నరికి,
పొలాల్ని పెరికి
ఎపార్టుమెంట్లని పెంచి
ఏపుగా, ఎదిగామనుకుంటున్నారు - నీడ
నింగిని తాకుతూ, ఎండకు మండుతూ
ఎండిపోతున్నట్లనిపిస్తున్న ఆ ఎపార్టుమెంట్లలో
పిల్లగాలులు లేక పిల్లాపెద్దా అల్లాడిపోతున్నారు
ఏసి గదులతో రోసి, ఏకాకుల్లా
ఒకరికి తెలియకుండా ఒకరు
సహజ వాయువుల కోసం
సహజ వనరుల కోసం తల్లడిల్లిపోతున్నారు -నీడ
తల్లిదండ్రులు హోమ్‌వర్క్ చేస్తుంటే
పిల్లకాయల తలకాయలు
టీవీల ముందు వేలాడుతూ
కళ్లజోళ్లతో కానె్వంటుల కెళ్తున్నాయ్ -నీడ..

-షణ్ముఖశ్రీ.. 8897853339