Others

లయన్ బిడ్డ లయనే( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాటన్నది వేరొకరెవరో కాదు.
సాక్షాత్తూ ఈనాటి ‘లయన్’ బాలకృష్ణ తండ్రి యన్‌టి రామారావే. ఇది ఏ సందర్భంలో ఎవరితో అన్నారో ఎంత ఎమోషనల్‌గా అన్నారో తెలుసుకోవాలంటే 1980 ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లవలసిందే!
దాసరి దర్శకత్వంలో కేసీ ఫిలింస్ బ్యానర్‌లో కోవై చెళియన్ నిర్మాతగా ‘సర్కస్ రాముడు’ చిత్రం యన్‌టి రామారావు హీరోగా జయప్రద, సుజాత హీరోయిన్లుగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ముదుమలై అడవుల్లో షూటింగు జరుగుతోంది. ‘అడవిరాముడు’ చిత్రం తర్వాత ఏనుగుల సెంటిమెంటెక్కువైంది. ఎటుచూసినా ఏనుగులే. లేళ్లూ, జింకలూ అప్పుడప్పుడూ కనిపిస్తూ కనువిందు చేసేవి. ఈ సినిమా కోసం వేటూరి ఓ పాట రాశారు. ‘ఓ బొజ్జ గణపయ్య/ నీ బంటు నేనయ్యా/ నీ చవితెప్పుడో చెప్పవయ్యా/ ఈ సవతి పోరే తీర్చవయ్యా’ ఇదీ పల్లవి. జయప్రద, యన్‌టిఆర్‌ల మీద చిత్రీకరణ.
జనవరి మాసంలో షూటింగు గనుక చలివొణికించేస్తుంది. ఆ యూనిట్‌లో చలికి చలించని వ్యక్తి ఒక్క యన్‌టిఆరే!
డ్యాన్స్ మాస్టారు సలీమ్. తెలుగు తమిళ భాషల్లో సలీమ్ మాస్టారి పేరు మార్మోగి పోతోంది.
వీరావేశంతో స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. వాటిని దాసరి, యన్‌టిఆర్ ఓకె చేస్తున్నారు. డాన్సు కంపోజర్లు శివశంకర్, నాగమణి (రాజేష్ భార్య) అద్భుతంగా చేసి చూపిస్తున్నారు. ఆ స్టెప్స్ యన్‌టిఆర్ వేస్తుంటే యూనిట్ మొత్తం కేరింతలు కొడుతోంది. ఆ సమయంలో అదో మానియాలా పట్టుకుంది యన్‌టిఆర్‌కి. ఎంతటి కష్టసాధ్యమైన స్టెప్స్‌వేసి చూపించినా వెనువెంటనే ఆ స్టెప్స్‌వేసి చూపించి యూనిట్ అందర్నీ థ్రిల్ చేసేవాడు. సలీమ్ మాస్టారు పొరపాటున ఏవైనా యన్టీఆర్ బాడీలాంగ్వేజీ తగ్గట్టు సుళువుగా స్టెప్స్ కంపోజ్ చేస్తే ‘ఇందులో మేం చేయడానికేముంటుంది బ్రదర్, మార్చండి. ఏదైనా టిపికల్‌గా ఉండాలి. మా ఫ్యాన్స్ ఎంజాయ్ చెయ్యాలి. మేం ఇంత చలిలో పడుతున్న కష్టమంతా మా ఫ్యాన్స్ కోసమే’ అన్నారు యన్‌టిఆర్. రెచ్చిపోయి చేశాడు సలీం మాస్టారు. ఇంకా రెచ్చిపోయి చేశారు యన్‌టిఆర్, జయప్రదలు.
ఇలా చేస్తూంటే నిర్మాత దర్శకులు కోవై చెళియన్, దాసరి ఆనందానికి హద్దులుంటాయా? లంచ్ బ్రేక్ అయ్యింది.
యన్‌టిఆర్ సెపరేట్‌గా కాటేజీలో లంచ్ చేసి వచ్చేశారు. సలీమ్ మాటకలుపుతూ ‘అన్నగారూ, ఇటీవలి కాలంలో బాలయ్యబాబు విజయశాంతితో కలిసి ఇరగదీస్తున్నాడండీ’ అన్నాడు. ఆ మాటలు విన్న యన్‌టిఆర్ మెచ్చుకుంటాడని ఆశపడ్డాడు. కానీ, వెంటనే యన్‌టిఆర్ ఫైరయ్యారు. ‘వాట్ నానె్సన్స్ ఆర్యూ టాకింగ్. నన్ కెనాట్ బౌట్ అంటిల్ దిస్ లయన్ రోర్స్’ అన్నారు. సలీమ్ మాస్టారికి ఆమాట అర్థంకాకపోయినా పెద్దాయన ముఖంలో కోపం మాత్రం అర్థమైంది.
‘ఈయనది ఎంతటి రాతి గుండె. సొంత కొడుకుని పొగిడినా సహించలేక పోతున్నాడు. నా తలరాత గాకపోతే, పెద్దాయన ముందు నేనెందుకు పిచ్చిపిచ్చిగా వాగాలి’ అని మాతో వాపోయేవాడు. (నేనా చిత్రానికి సహాయ దర్శకుడిని).
మళ్లీ సాంగ్ ప్రారంభమయ్యింది.
సలీమ్ మాస్టారు స్టెప్స్ చెబుతున్నారు. హీరో హీరోయిన్లు అద్భుతంగా చేస్తున్నారు. ముదుమలై ఫారెస్ట్‌లో, దట్టంగా అడవి ఉండటం వలన ఐదు గంటలకే వెలుతురు తగ్గిపోతుంది. వెలుతురు తగ్గేలోగా పాట ఫినిష్ చేయాలన్న పట్టుదల. చెప్పింది చెప్పినట్టు వెంట వెంటనే టేక్ ఓకె చేసేస్తున్నారు యన్‌టిఆర్, జయప్రదలు. కన్నప్ప కెమారామెన్. యన్‌టిఆర్‌కి అత్యంత ఇష్టుడు కన్నప్ప. రామకృష్ణ స్టూడియోస్‌కి ఆయనే పర్మినెంట్ కెమరామన్ తొలి రోజుల్లో. అందరూ ఎంజాయ్ చేస్తూండగా పాట పూర్తయింది.
సలీం మాస్టారు బుంగమూతి పెట్టాడు. అది గమనించారు పెద్దాయన. ‘మాస్టర్‌జీ! కంగ్రాట్స్. పాట అద్భుతంగా కంపోజ్ చేశాం. ఇందాక మీరు బాలయ్య గురించి చెప్పేరుకదా. ఇందులో వింతేముంది? పులిబిడ్డ పులే! లయన్ బిడ్డ...లయనే! బీ హ్యాపీ’ అంటూ మాస్టార్ని ఓదార్చినట్టు భుజం చరిచి, బుగ్గచిదిమి, నవ్వుతూ కారెక్కేశారు యన్‌టిఆర్. సలీం మాస్టారి ఆనందానికి అవధుల్లేవు. ‘ఆడ డడ్డా. అవంగళ్ ఎన్‌దైవమ్’ అన్నాడు. అంటే ఆయనే నా దైవం అని. ఎదుటి మనిషి చేత ఎలా పని చేయించుకోవాలో తెలుసుకోగల వ్యక్తి గనుకనే యన్‌టిఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడయ్యాడు.

-ఇమంది రామారావు 9010133844