Others

ఏదో ఒక రాగం (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో ఒక రాగం/ పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలన్నీ కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

వెంకటేష్, సౌందర్య నటించిన రాజా చిత్రం కోసం -సిరివెనె్నల సీతారామశాస్ర్తీ కలంనుంచి జాలువారిన పాట ఇది. సిరివెనె్నల సాహిత్యం, ఎస్‌ఎ రాజకుమార్ బాణీ, బాలు/ చిత్రలు పాడిన తీరు, స్క్రీన్‌పై దర్శకుడు ముప్పలనేని శివ ప్రజంటేషన్ అన్నీ చక్కగా అమిరి -పదే పదే వినాలనిపించే పాట ఇది. ముఖ్యంగా పాట కోసం సంగీత దర్శకుడు రాజ్‌కుమార్ సమకూర్చిన స్వరాలు వీనులవిందు. వెంకటేష్, సౌందర్య, హాస్య నటులు సుధాకర్, చంద్రమోహన్ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించిన చిత్రం. చంద్రమోహన్ కూతురు సౌందర్యను సవతితల్లి అడుగడుక్కీ అవమానిస్తూ మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తుంటే -రెండవ భార్యను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఆ పరిస్థితిలో ఆత్మహత్యకు ఉపక్రమించిన సౌందర్యను కాపాడి, ఆమె ఎదుగుదలకు కారణమవుతాడు వెంకటేష్. ఆమె గొప్ప స్థాయకి చేరిన తరువాత బంధవర్గం ఆమె చుట్టూ చేరి -వెంకటేష్‌కు దూరం చేస్తారు. అది గ్రహించిన సౌందర్య అతన్ని వెతుక్కుంటూ చివరకు కలుస్తుంది. ఇద్దరూ ఒక్కటవ్వడంతో చిత్రకథ సుఖాంతమవుతుంది. ఉన్నిదతిల్ ఎన్నై కొడుదెన్ తమిళ చిత్రం ఆధారంగా దీన్ని తెరకెక్కించినప్పటికీ, దర్శకుడు శివ తన ప్రతిభతో నేటివిటీ చూపించి కథను రక్తికట్టించారు. చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్ సాంగ్స్. కానీ, ఏదో ఒక రాగం పాట మాత్రం హైలెట్. ఇప్పటికీ శ్రోతలను అలరించే పాట. అద్భుతమైన పాట. ఇంకా ఇంకా వినాలనిపించే పాట. చిత్రానికి ఆయువుపట్టు సాహిత్యం, సంగీతం, కథనం, అభినయం. ఇది గ్రహిస్తే -ఏ దర్శకుడికీ తిరుగుండదు. రాజా చిత్రానికి అవన్నీ అక్కగా అమిరాయ కనుక -సినిమా హిట్టుకొట్టింది.

-సిహెచ్ నాగేశ్వరరావు, హైదరాబాద్