Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రహస్యావిష్కరణం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు:
రాముడనగ ఎవ్వరంచు రామలు మీరెంచితిరో?
సూర్యవంశజుండాతడు సూర్యుండాతండు

‘రామ’యనగ సీతన ‘రాముండ’న రాఘవుండు
అర్థవ్మౌ అర్థనారి ఈశ్వర తత్త్వమ్ము

ప్రజలను తన బిడ్డలట్లు కాచి బ్రోచినాడు
విడిచెను తన సతిని కాని వీడబోడు ధర్మం

కృష్ణప్రత్నులు:
అదియేమిటి రాముండన సూర్యుండని అందురు?
అతడు సూర్యుడైన వేళ అతని తండ్రి ఎవరు?

శ్రీకృష్ణుడు:
దశదిశలను విస్తరించు విశ్వమె దశరథుడు
ముల్లోకాలను బోలెడు ముదితలతని రాణులు

రవి చంద్రులె తనయులౌచు రాజునకుదయించిరి
రవియే రాముండోరుూ! భరతుండో చంద్రుడు!

వారినంటి తిరుగునట్టి వారి ఛాయలను బోలుచు
వారితోడ నుదయించిరి లక్ష్మణుండు భరతుండు.
కృష్ణపత్నులు:
ఇది ఏమిటి? విచిత్రమ్ము? ఎచట వినగబోము!
ఐనతోడ సీత ఎవరు? ఐననెవరు ఊర్మిళ?

శ్రీకృష్ణుడు:
క్షమను మించు క్షమాగుణం సీతమ్మకు సింగారం!
ఊర్మిళయన విరహమ్మున వేగిన సరసీరుహం!
- ఇంకాఉంది