మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శక్తిసాధనయనగా మాటలుగాదు, మహాకఠినమైన-ప్రమాదకరమైన- సాధనలతో గూడుకొనియున్నది. జగజ్జనని సఖిననుభావముతో నేను రెండు సంవత్సరములు సాధనచేసినాను, ఐనను నాది పుత్రభావము- శిశుభావము; నాకేవనిత పాలిండ్లైనను నా తల్లి పాలిండ్లవలెనే తోచును.
స్ర్తిలందఱును శక్తిస్వరూపములు. వివాహ సమయమున ఈ దేశమున పశ్చిమ ప్రాంతములలో వరుడుచేత నొకకత్తెరను దాల్చును: వంగ దేశమున, అడకత్తెరను ధరించును. సాక్షాచ్ఛక్తిస్వరూపమగు వధువు యొక్క సాయమున వరుడు తాను మాయాబంధములను విచ్ఛిన్నము చేయునని దీని భావము. ఇదియే వీరభావము. కాని దీనిని నేనెన్నడును అవలంబింపలేదు. నేనవలంబించునది శిశుభావము.
442. ప్రశ్న: సాధకుడగు తన భర్తతో భార్య, ‘‘మీరు నన్ను ఉచిత రీతిని జూడకున్నచో, నేను ఆత్మహత్య చేసికొందును’’అని పలుకుననుకొనుడు. అపుడాతడేమి చేయవలసియుండును?
ఉ.అట్టి భార్యను విడిచివేయవలయును- మోక్షసాధనకు అడ్డువచ్చు భార్యను విడువవలసినదే. ఆమె ఆత్మహత్యచేసికొననీ, మఱేమైన కానీ. బ్రహ్మమార్గమునకు అడ్డుతగులు భార్య అవిద్యాస్వరూపిణి! ఐనను రాజు, దుష్టుడు, భార్యయు సైతము భగవంతునియెడ నిర్మల భక్తికలవానికి వశులగుదురు. నిజమైన భక్తుడగువాని భార్యయు క్రమక్రమముగా బ్రహ్మమార్గమునకు తిరుగగలదు. భర్త యోగ్యుడగునేని భగవత్కృపవలన భార్యయు యోగ్యురాలగును.
443. తల్లిదండ్రులు వరునికి ముఖ్యులు. వారు సంతుష్టులు గాదితె ఏ సాధనలును ఫలింపవు. శ్రీచైతన్యుని గనుడు. భగవద్భక్తి పరవశుడయ్యును, తాను సన్న్యాసము స్వీకరించుటకు పూర్వము తల్లిని సమాధానపఱుచుటకెంత శ్రమపడెనో! ‘‘అమ్మా! దుఃఖింపకుము. అప్పుడప్పుడు వచ్చి నిన్ను దర్వించుచుందును’’అని చెప్పెను. దేవతల ఋణము, ఋషుల ఋణము, పితరుల ఋణము, భార్య ఋణము-అని మానవుడు తీర్పవలసిన ఋణములెన్నోయున్నవి. తల్లిదండ్రుల ఋణమును తీర్పనిచో ఏకర్మమును ఫలింపజాలదు. భార్యయెడలను తీర్పవలసిన ఋణమున్నది. తన భార్యను విడిచిపెట్టి హరీశుడిక్కడ నున్నాడు. ఆమెకేదియో జీవనోపాధి కల్పింపకుండునెడల నేనాతని దుర్మార్గుడనియందును. రామప్రసన్నుడెంతసేపు, హఠయోగికి నల్లమందు, పాలు సమకూర్చుటకై దేవులాడుచున్నాడు. మనువు సాధుసేవను విధించియున్నాడని యాతడు చెప్పును. ఈతడిట్లు తిరుగుచుండ, ఇతని ముసలితల్లి తినుటకులేక పస్తుండవలసివచ్చుచున్నది. ఆ తల్లి తానే బజారునకుపోవలయును. ఈ చర్య జూచిన నాకు ఒడల మండుచున్నది.
444. కాని ఒక్క విషయమును పరిగణింపవలయును. మానవుడు భగవత్ప్రేమోన్మత్తుడైనయెడల అట్టివానికి తల్లియెవరు? తండ్రి యెవరు! భార్య యెవరు? భగవంతునాతడు అమితముగా ప్రేమించును, ప్రేమోన్మత్తుడౌను. వానికిక కర్తవ్యమనునది లేదు. ఆతడన్ని బాధ్యతలనుండియు విముక్తుడగుచున్నాడు. ఈ స్థితిని బొందినవాడు ప్రపంచమునే మఱచును; సర్వజనులకును ప్రాణతుల్యమగు శరీరమును గూర్చియే వానికి స్పృహ లేకుండును.
445. లోకమున నెల్లరకును తల్లిదండ్రులెంతయు పూజార్హులు. వారు జీవించియున్నంతవఱకు శక్తికొలదియు వారిని సేవింపవలయును. మరణానంతరము యథోచితముగా వారికి శ్రాద్ధకర్మముల నొనర్పవలయును. పుత్రుడు గర్భదరిద్రుడైయున్నను, శ్రాద్ధము జరుపుటకు శక్తిలేనివాడైయున్నను, వనమునకుపోయి, తన యశక్తతనెంచి కన్నీరు విడువవలయును.

- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి