Others

తపస్సుకు ధ్యానానికి తేడానా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము, మానవ శరీరం
*
డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
9849560014
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
సమాధి స్థితిలోనున్న వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం వుండదు. విషయమేమిటంటే కఠోర నియమాలతో కూడిన తపస్సుకి, ధ్యాన యోగానికి తేడా వుంది. ధ్యానయోగంలో మనసు ధ్యేయ వస్తువునందు, ఫలాపేక్ష, కోరిక లేకుండా నిశ్చలమై నిలిస్తే కఠోర నియమాలతో మిక్కిలి శ్రమతో కూడిన తపఃప్రక్రియ అక్కరలేదు. సమాధి స్థితి కుదరనప్పుడే కఠోర ప్రక్రియలన్నీ అవసరమవుతాయి. ఉదాహరణకు పద్మపురాణంలోని కార్తవీర్యార్జునుని కథ రుూ విషయాన్ని స్పష్టంచేస్తోంది. శ్రీగురు దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో కార్తవీర్యుడు, మాసములు తరబడి సమాధి స్థితిలో వుండి తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చి తరువాత లోక వ్యవహారాలు చక్కబెట్టే వాడని తెలుస్తుంది.
భారతీయ యోగ శాస్త్రాలననుసరించి సమాధి స్థితిలోకి వెళ్ళగలిగినవారు దీర్ఘాయువును పొందగలరని తెలుస్తోంది. సమాధి స్థితిని చేరగలిగినవారు, జ్ఞాన దృష్టితో మరణ సమయాన్ని తెలుసుకొని అట్టి సమయానికి సమాధి స్థితిని పొందిఉన్న యోగిని మృత్యుదేవత వచ్చి చూసినా యోగి మృత తుల్యుడిగానే వుంటాడు. ఎందువల్లనంటే అతని హృదయనాడీ స్పందనలు ఆగిపోయి వుంటాయి. మనసు లయమై వుంటుంది. అది ఒక విచిత్ర స్థితి, నిద్రకాదు, మెలకువకాదు, యోగి సమాధి స్థితినుండి బయటకువచ్చిన తరువాత జీవించి వుంటాడు. ఈ సందర్భంలో యోగ విద్యనే శరీరంగా చేసుకొని అష్టసిద్ధులను అరిచేతి ఉసిరికగా చేసుకుని,. 280 (1607 నుండి 1887) సంవత్సరముల దీర్ఘకాలము జీవించి రుూ భూమిపై నడయాడే విశ్వనాధుడిగా భక్తులచేత రుూనాటికి కాశీక్షేత్రంలో నిత్య పూజలందుకుంటున్న శ్రీ త్రైలింగస్వామి మన తెలుగువాడైనందుకు గర్వపడుతూ వారిని స్మరణకుతెచ్చుకోవడం సందర్భోచితమనిపిస్తుంది. స్వచ్ఛంద మరణాన్నిపొందిన రుూ మహాయోగిని అపర తెలుగు భీష్ముడనుట అతిశయోక్తికాదు. కాబట్టి సమాధిస్థితిని సాధించిన యోగి ప్రాణాన్ని వశం చేసుకొని ఎక్కువకాలం జీవించగలడు. ఇది వేరేరకంగా చెప్పాలంటే ఆయుర్ధాయాన్ని పెంచడం అనటంకంటే జీవితాన్ని అనుభవించడంలో వేగాన్ని తగ్గించటమని కూడా చెప్పవచ్చు.
గాఢమైన ధ్యానమే మనసును, ఆలోచనలను అధిగమించేలాచేసి మనల్ని ఒక సాక్షిగా నిలబెడుతుంది. ఆ సాక్షీతత్త్వంగా నిలిచిపోవడమే శాశ్వతమైన దివ్యజ్ఞానమనిపించుకుంటుంది. దానినే దివ్యదృష్టి అనవచ్చు. అట్టి తత్త్వమే మనిషిని అన్ని ద్వంద్వములనుండి విముక్తుడ్ని లేక అతీతుడ్ని చేస్తుంది. అంటే మనసుని అధిగమిస్తే ద్వంద్వములనబడే సుఖదుఃఖములు, కష్టసుఖాలు, సత్యాసత్యాలు, జనన మరణాలు, చీకటి వెలుగులనే వాటినన్నిటిని అధిగమించినట్లే మనసు అన్నిటిని భిన్న ధృవాలుగా విభజిస్తే మనసు లయమైన స్థితి దానికి పూర్తి భిన్నంగా వుంటుంది. నేను అనేదేది స్ఫురణకు రాని వాటికతీతమైన అస్తిత్వంలో మునిగిపోవడమే అసలైన దివ్యత్వం, అదే అంతిమ సత్యం, అట్టి నిశ్చలస్థితి కేవలము ధ్యానమువల్లనే సాధ్యం. ప్రార్థన వేరు-్ధ్యనం వేరు ప్రార్థనమనల్ని బయటకు తీసుకువెడితే ధ్యానం మనల్ని పరమ నిశ్శబ్దమైన లోలోతులకు తీసుకువెడుతుంది. ధ్యానము మనిషిని దివ్యుణ్ణిచేయగలదు. అట్టి దివ్యత్వమే సత్యమైనది. నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది. అట్టి సత్యము అవినాశి.
- ఇంకావుంది...