Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపత్నులు:
సీత భూమియైనవేళ రావణుండు ఎవడు?
సీత నెత్తుకొని పోవగ ఎందులుకేతెంచెను?

శ్రీకృష్ణుడు:
కాలమేఘ మటుల నరచువాడే రావణుడు
రాత్రులందు బాహువులను బంధించును ధాత్రిని

ఆతని తమ్ముండెవరో అర్థమైనదనుకొందును
వెలిగెడు చంద్రునిబోలుచు వెలుగు విభీషణుడు

వెలుగీతడు చీకటతడు నిరతము పోరాటం!
అందుకొరకె వారి మధ్యనంతటి వైరమ్ము!

అందులకే అతడీతని గెంటివేసినాడు
అతడందుకె శ్రీరాముని పదములంటినాడు.

కృష్ణపత్నులు:
ఓహోహో! ఇది ఏమిటి? నమ్మను లేకున్నాము!
ఓహో! ఎవరోయి హనుమ? సుగ్రీవుండెవ్వరు?

శ్రీకృష్ణుడు:
ప్రబలవ్మౌ మారుతమ్మె రామ భక్త హనుమ
అగ్ని శిఖల మరిపించెడు వాడే సుగ్రీవుడు.

మీ ఉత్సుకత చూడనాకు ముచ్చటేయుచున్నది!
మీరలెరుగ పోవుటేమి? యుగమే గడచినది!

కృష్ణపత్నులు:
తెలిసినచో అడుగుదుమే? తెలిసిన విసిగింతుమే?
రామాయణ మనగ నొక్క పుక్కిటి కథయనుకొంటిమి!

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087