Others

అవిసెగింజలు - అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులు అవిసె గింజలను ఎంతో పురాతన కాలం నుంచి తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇప్పుడంటే చాలామంది వీటిని తినడం తగ్గించేశారు. కానీ నిజానికి అవిసె గింజలను తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎవరూ వాటిని విడిచిపెట్టరు. ఈ గింజల్లో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి1, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, జింక్, సెలీనియం వంటి పోషకాలు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. నిత్యం అవిసె గింజలను తినడం వల్ల ఎలాంటి లాభాలో చూద్దాం..
* చేపలు తినలేని వారికి అవిసె గింజలను మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఒట్టిగా అవిసె గింజలను తినలేని వాళ్ళు అవిసె గింజల పొడిని గోధుమ పిండి, ఇడ్లీ, దోశ పిండిలో కలుపుకుని కూడా వాడుకోవచ్చు.
* అవిసె గింజలలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే శారీరక అలసట తగ్గుతుంది. శక్తి లభిస్తుంది. శరీరం చురుగ్గా ఉంటుంది.
* ఊబకాయం కొందరికి జన్యుపరంగా వస్తే మరికొంతమందికి వారి జీవనవిధానం, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. తినే ఆహారంపై ముందు నుంచీ శ్రద్ధ పెడితే దీన్ని నివారించవచ్చు. అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో ప్రొటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు శరీర బరువు తగ్గుదలలో విశేషంగా తోడ్పడతాయి.
* మహిళలు రోజూ అవిసె గింజలను తింటే వారిలో హార్మోన్లు సరిగ్గా విడుదల అవుతాయి. దీంతో రుతుక్రమం సరిగ్గా ఉంటుంది.
* వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో తినే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
* అవిసె గింజల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పులు రాకుండా చేస్తాయి.
* అవిసె గింజల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల నేరుగా తింటే సరిగా జీర్ణం కాదు.. అందుకే వీటిని సూప్, సలాడ్‌ల రూపంలో భోజనంతో పాటుగా తీసుకోవాలి.
* ఇవి తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డిప్రెషన్ దూరమవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* తలనొప్పి, కీళ్ల నొప్పులకు అవిసె గింజలు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
* అవిసె గింజలను తినడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.
* అవిసె గింజలను తినడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని అనేక పరిశోధనల్లో తేలింది.