Others

నా లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ ప్రపంచంలో నువ్వుంటావని
మిత్రులు బంధువులు అంటూ వుంటే
చిన్న పాప తెల్లకాగితంపై
గీసిన ఆకారం లేని గీతల్లాగా
చిక్కుపడ్డ దారంలాగా
ఆలోచనలు కమ్ముకున్నాయ

అప్పుడే మనసు మాటలాడింది
మెరుపులా ప్రశ్నించింది కూడా
నీది నిజంగా ఏ లోకమని
నాలో ఉండీ ఎలా అడిగావని
ఉరుములా గర్జిద్దామనుకున్నా
కాని తనని ప్రశ్నించలేదు
ఆ సాహసం చేయలేను మరి

నేనెప్పుడూ కలల్లో బతుకుతానని
ఊహల్లో పయనిస్తానని
ఎవరేమన్నా సహిస్తా భరిస్తా
క్షమిస్తా గౌరవిస్తా
ఎందుకో తెలుసా
నేను వారి ప్రపంచంలోనూ
ఉన్నవాణ్ణి తిరుగాడుతున్నవాణ్ణి

అమ్మ ఊరికి నాన్న పల్లెకీ
ఎవరూ లేకుండా ఎన్నిసార్లని పోను
అందుకే నిత్యం నిరంతరం
ఎవరికీ చెప్పకుండా తెలియకుండా
నాదైన నాలో దాగున్న
ఆ ఇహానికి పరానికి
ఎవరూ లేకుండానే
ఒంటరి ప్రయాణం కడతా

దానికి వాకిళ్లు కిటికీలు
తాళాలు బోల్టులు అసలే లేవు
నిత్య స్వాగతం నిరంతర ఆహ్వానం
పలికే నా మూలానికి మరెవ్వరూ లేకనే
పోతుంటా వస్తుంటా
అది పూర్తిగా నా సొంతం మరి
ఆ జగమే నా సహచరి కూడా
అక్కడ నేను ఏకాకిని కానే కాదు

- జంధ్యాల రఘుబాబు, 9849753298