Others

ముగ్గు తునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె వేళ్లలోంచి
క్షణంలో రాలిపడుతుంది
రెండు నిలువుగీతలు
రెండు అడ్డగీతలు
ఉదయస్తున్న సూర్యకిరణాలను తెంపి
నేలమీద అతికించినట్టు.
మధ్యలో చుక్క
ఒక జీవబిందువు తొణికిసలాడుతున్నట్టు
అంత పెద్ద వాకిలికి
ఆ ముగ్గు ఒక చిరునవ్వు.

నిద్రమబ్బు కాస్త
నిగనిగల మెలుకువగా విప్పారినట్టు
ఎవరికో ఎవరికో
స్వాగతం పలుకుతున్నట్టు.

తదేకంగా చూస్తే
ముగ్గుల్లోంచి
ఎనె్నన్నో ఆకృతులు బయటపడతాయ.
ఒక తీగ
ఒక పువ్వు
అల్లిబిల్లిగా అల్లుకున్న
ఒక జీవన సరళి,
నిన్నటి అపజయాల కథ
ఓ కన్నీటి శుభ్రత

తొక్కుకుంటూ వెళ్లేవాళ్లను
ఏమీ అనకండి
బతుకు ముగ్గులోకి
ఆత్రంగా పరుగులు తీస్తున్నారు.
అంతా క్షణంలో జరిగిపోతుంది
పట్టించుకోము
కాని ఆమె సహజ చిత్రకారిణి
చైతన్య ధనుర్ధారిణి
సాయంత్రం
ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్తే
వాటి మూలాలు
మనకీ ముగ్గుల్లోనే దొరుకుతాయి.

- డా. ఎన్.గోపి