Others

మనిషితనపు రంగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగులంటే ఆషామాషికాదు
ప్రతీ భావానికి ప్రతీక
జీవితంలో కష్టనష్టాల సునామిలో
కొట్టుకుపోయినా
ధైర్యాన్నిచ్చే గొప్ప నేస్తం

స్వచ్ఛ తెలుపులాంటి మనసుతో
మనుషుల్ని హత్తుకున్నప్పుడు

అన్యాయంపై గొంతెత్తి
ఎర్రజీరలు పులుముకున్న
కళ్లలోని ఎరుపురంగులు

నచ్చలేనితనాన్ని
మోముపై నలుపై నిరసనై
వెల్లువెత్తినప్పుడు

ఒకటా రెండా
సకల భావోద్వేగాలకి
రంగొక పూరకం

అసమానతలని పెకలించి
మనుషులమధ్య
సమానత్వాన్ని పెంపొందించే
సప్తవర్ణాలకి
వేల వందనాలు!

సంవత్సరాలు తరిగినా
వనె్నతరగని రంగుల పండుగకి
జేజేలు
కుల మతాలకి అతీతంగా
మనుషులంతా ఒక్కటవ్వాలని
హోళి సాక్షిగా కోరుకుందాం!

-పుష్యమీ సాగర్ 90103 50317