Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటుల విశ్వరహస్యాల వినగ లేదు మేము
ఇటుల నెవరు వివరమ్ముగ విప్పి చెప్పలేదు

ఐనతోడ కైక ఎవరు? మంథరమ్మ ఎవరు?
కక్షతోడ శ్రీరాముని కానల కంపేరు?

శ్రీకృష్ణుడు:
రాత్రింబవలుల కథయే రామాయణమోరుూ!
రాత్రులు చెరలోన సీత! పగలు రాజభోగం!

పొడుపు కథలు వినియుందురు- విడుపులు వినియుందురు
అట్టి పొడుపు విడుపులతో కూడినదే రామకథ!

ఇది యెరిగిన రామాయణ మెరిగి నటులె మీరు
లేని తోడ లేనట్టులె లేమలెరుగ రండి!

పాతాళమ్మన చెల్లును కైక చరిత చూడ
తామనమున తన చంద్రుని రాజుగ కోరెను

మంథరయన మంథనమ్ము చేసెడు కవ్వమ్ము
అందులకే కైక మదిని గానుగ నాడించెను

రవియుండగ శశి యెట్టుల రాజ్యమ్మును సేయు
అందులకే ఆ రాజును అడవికంప జూచెను

కృష్ణపత్నులు:
ఎవరు శబరి ఐన తోడ? ఏమిటామె గోడు?
బ్రతుకంతయు వేచి ప్రభువు పదముల బడి ముగిసెను?

శ్రీకృష్ణుడు:
తన హృదయం కమలవనం తానే ఒక కమలం
కమలనాభు పదసన్నిధి కాంక్షించుచు చేరెను

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087