Others

నిన్ను నీవు తెలుసుకొంటే...( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
ఎందుకంటే, దానికోసం మీరు అబద్ధాలు చెప్తూ, మోవసాలు చేస్తూ, జిత్తులమారిగా తయారై పరమ నీచులుగా తయారవుతారు. చివరికి మీరుఎవరి పట్ల, కనీసం మీ పట్ల కూడా ఒక్క క్షణమైనా నిజాయిగా ఉండలేక, ఎప్పుడూ మోసాలు చేస్తూ కపటిగా నటిస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలో ముందుకెళ్ళేందుకు అవన్నీ చక్కగా ఉపయోగపడతాయి. అంతేకానీ, సత్యాన్ని ప్రామాణికంగా చేసుకుని, నిజియితీగా జీవించాలనుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనముండదు.
డబ్బు, హోదా, అధికారం, గౌరవ మర్యాదలు, కీర్తిప్రతిష్ఠలు, పేరుప్రఖ్యాతులు సంపాదించకపోతే మీరెవరో మీకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి, అవే మీరు. మీకుగుర్తింపును తెచ్చేవి, మీలో వక్ర భావనలు రేకెత్తించేవి అవే. అదే మీ అహం, కాబట్టి, అహం అనేది అర్థం కాని విషయమేమీ కాదు. నిజానికి, అది చాలా చిన్న విషయం. మీరెవరో మీకు తెలిదయు. కానీమరెవరో మీకు తెలియకుండా జీవించడం అసంభవం.
నేనెవరో నాకే తెలియకపోతే నేనిక్కడ ఉండి ఏమి చేస్తున్నట్లు? అలా చేసే పని ఏదైనా అర్థరహితంగానే ఉంటుంది. కాబట్టి, నేనెవరు? అనేదే ముందుగా నేను తెలుసుకోవలసిన ముఖ్య విషయం. అపుడే నేనుచెయ్యగలిగినపనిన పూర్తి అర్థవంతంగా చేస్తూ, నానికి కేంద్రానికి నేను చేరుకోగలుగుతాను. నేనెవరో నాకే తెలియకపోతే నేను ఎక్కడికి ఎలా చేరుకోవాలో నాకెలా తెలుస్తుంది? ఆ స్థితి నేను ఊరికే ‘అటు ఇటు’ తిరుగుతానే తప్ప, నా గమ్యాన్ని చేరుకున్నానని నేను చెప్పలేను.
మీరెవరో మీకు తెలియదు. కాబట్టి, అందుకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒక కృత్రిమమైన గుర్తింపు మీకు అవసరమవుతుంది.మీ స్వాధీనంలో వున్నవన్నీ మీకు అలాంటి గుర్తింపునిచ్చేవే.
చాలా అమాయకంగా పరికించే గుణంతో మీరుఈ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అందరూ అలాగే, అలాంటి చైతన్యంతో ఇక్కడకువచ్చినవారే. కానీ, ఎదిగిన ప్రపంచంతో మీరు బేరాలు మొదలుపెట్టారు. దానిదగ్గర మీకిచ్చేందుకు చలా ఉన్నాయి. కానీ, దానికిమీరిచ్చేందుకు మీదగ్గర కేవలం చిత్తశుద్ధితో కూడిన ఆత్మగౌరవం మాత్రమే ఉంది తప్ప, వేరే ఏదీ లేదు. దానిని మీరు అమాయకత్వం తెలివి, ప్రామాణికత-ఇలా ఎవగైనా అనవచ్చు.ఎలా అన్నా మీ దగ్గర ఉండేది కేవలీ మీ చిత్తశుద్ధి మాత్రమే.
శిశువు తన చుట్టూ వున్న వాటన్నింటినీ చాలా శ్రద్ధగా గమనించడంతోపాటు, అవన్నీ తనసొంతం కావాలని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటా డు. అది మానవ సహజం. పసిపిల్లలను చివరికిఅప్పుడే పుట్టిన పసిపిల్లలను గమనిస్తే వారి చేతులు ఏదో ఒకటి పట్టుకునేందుకు ఆరాటపడడం మనకుచాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఆ పసివాడు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అయితే, ఆ ప్రయాణంలో వాడుతని తాను పూరితగా కోల్పోతాడు. ఎందుకంటే, ఎలాంటి చెల్లింపులు లేకుండా ఈ ప్రపంచం నుంచి మీరు ఏదీ పొందలేరు. అయితే ఆ పసివాడు ఈ ప్రపంచానికి ఇస్తున్న చిత్తశుద్ధి ఎంత విలువైనదో వాడికే తెలయదు. త్రాసులో ప్రపంచాన్నిఒకవైపు, పసివాడి చిత్తశుద్ధిని మరొకవైపు ఉంచినపుడు ఎంతో విలువైన చిత్తశుద్ధి మాత్రమే మరింత బరువుతో మొగ్గుచూపుతుంది. కానీ దీనిగురించితెలుసుకునేందుకు ఆ పసివాడికి ఎలాంటి మార్గము లేదు. వాడికి దక్కవలసినదేదో దక్కింది. అందుకే వాడు ‘అది నాది’ అనుకుంటాడు. ఇపుడు నేను చెప్పే కథ వింటే అది మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
*
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.