Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపత్నులు:
ఐననొక్క సందియమ్ము మనమున మిగిలేను
ఎవ్వరు విశ్వామిత్రుడు? ఎవరు వశిష్ఠుండు?

వారి మాట దశరథుండు మీరకుండుటేమి?
అతని మాట నాతయుడు ఆచరించుటేమి?

శ్రీకృష్ణుడు:
విశ్వానికె మిత్రుడోయి విశ్వామిత్రుండు
రాశిపోసి రిక్కలనే చేయును జన్నమ్ము

శిష్టులలో శిష్టుండు వశిష్ఠుండు సుమీ
ఆతని మించిన ఘనుండీతడు ఎరుగండి

కృష్ణపత్నులు:
ఐన తోడ లంక ఏమి? ఆ అయోధ్య ఏమి?
రామరావణుల యుద్ధం జరుగుటనది ఏమి?

శ్రీకృష్ణుడు:
ఆకాశమ్మంత ఎత్తు- మనసుకుండు లోతు
అనగానదియే అయోధ్య- దుర్బేధ్యమ్మదియే

చీకటి సీమను బోలును లంకానగరమ్ము
కాలమ్మున కాలం వలె రావణుండు ప్రజలు

ఆ చీకటి ఛేదింపగ- ఆ మబ్బుల నిర్జింపగ
క్రక్కదలెను సూర్యుండే- కథగా నదిమారెను

దేవళమ్ము విశ్వమ్మే- దేవుడు సూర్యుండు
అతనికి అవనికి జరుగును- అనుదిన కళ్యాణం
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087