Others

సహజ రంగులే ముద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగుల పండుగ వచ్చేసింది. పిల్లలే కాదు.. పెద్దల కేరింతలు కూడా మొదలయ్యాయి. హోలీ అంటే ఆడుకునే రంగులు గుర్తొస్తాయి. గులాబీ, నీలం, ఆకుపచ్చ, ఎరుపు.. ఈ నాలుగు రంగులు లేకుండా హోలీ పండుగ పూర్తవదు. కానీ హోలీ ఆడిన పదిరోజుల వరకు ఈ రంగులు శరీరాన్ని అంటిపెట్టుకుని పోవు. ఎంత రుద్దినా చర్మంపై రాష్ వస్తుందే తప్ప రంగు మాత్రం పోదు. కారణం రంగుల్లో ఉండే రసాయనాలు.. వీటివల్ల చర్మానికి చాలా అనర్థాలు వస్తాయి. ఈ రంగులు కంట్లో పడటం వల్ల కళ్లకు కూడా చాలా ప్రమాదం. అలాగే ఇంటి ప్రాంగణంలో కూడా ఈ రంగుల సందడి పదిరోజుల దాకా ఉంటుంది. ఇలా కాకుండా ఈసారి సహజ రంగులను తయారుచేసుకుని వాడుకుంటే ఆ మజాయే వేరు. కంటికి, చర్మానికి కూడా ఎటువంటి హాని జరగదు. మరి అలాంటి సహజ రంగులను ఎలా చేయాలో చూద్దామా..
ఊదా
ఒక కిలో బీట్‌రూట్‌లను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసి నీళ్లలో వేసి ఉడికించాలి. తరువాత ఈ బీట్‌రూట్ ముక్కల్ని మిక్సీ పట్టి ఒక బకెట్ నీళ్లలో కలిపేస్తే చాలు.. సహజమైన ఊదా రంగు తయారైపోయినట్లే..
పసుపు
చామంతి లేదా బంతిపూలను అరకిలో తీసుకుని తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఈ పూలను వడకట్టుకుంటే పసుపుపచ్చని నీళ్లు తయారవుతాయి. ఇంత తయారీ వద్దనుకుంటే రెండు కప్పుల పసుపును ఓ బకెట్‌లో కలుపుకున్నా పసుపు నీళ్లు తయారవుతాయి.
కాషాయం
ఇది మూడు రోజుల ముందు తయారుచేసుకోవలసిన రంగు. దీనిని మోదుగుపూలతో తయారుచేస్తారు. ముందుగా మోదుగుపూలను కోసుకొచ్చి ఎండబెట్టుకోవాలి. వీటిని పొడి చేసుకోవాలి. దీనికే కొద్దిగా పిండి కలిపితే కాషాయ రంగు తయారవుతుంది. అప్పటికప్పుడు తయారుచేసుకోవాలి అనుకునేవారు మోదుగుపూలను నీటిలో మరిగించి రాత్రంతా వదిలేస్తే కాషాయ రంగు నీళ్లు తయారవుతాయి.
ఎరుపు
ఎర్ర చందనాన్ని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెడితే ఎరుపురంగు నీళ్లు తయారవుతాయి. అలాగే మందార పూలను ఎండబెట్టి మిక్సీలో పొడిచేసి, ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపినా ఎరుపురంగు నీళ్లు తయారవుతాయి. లేదా ఒక బకెట్‌లో ఐదు చెంచాల సున్నాన్ని కలపాలి. దీనికి అరకప్పు పసుపు కలిపినట్లయితే ఎరుపు రంగు నీళ్లు తయారవుతాయి.
గులాల్
గులాబీలను మూడు రోజుల ముందే బాగా ఎండబెట్టాలి. తరువాత వీటిని పొడిలా చేసుకుని నీళ్లలో కలుపుకోవాలి. లేదా గులాబీ రెక్కలను నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి గులాబీ రంగు నీళ్లు తయారవుతాయి.
ఆకుపచ్చ
నాణ్యమైన వేపాకులను తీసి బాగా కడిగి నీటిలో వేసి ఉడికించి కాసేపు అలాగే ఉంచితే ఆకుపచ్చని నీళ్లు తయారవుతాయి. అలాగే హెర్బల్ హెన్నాలో కొద్దిగా బియ్యప్పిండిని కలిపితే కూడా ఆకుపచ్చని రంగు వస్తుంది. ఈ పొడిని నీళ్లతో కలుపుకుని హోలీ ఆడుకోవచ్చు. ఇలా సహజమైన రంగులతో రంగుల పండుగ చేసుకుంటే ఆనందమే ఆనందం.
*