Others

భారతీ సుతుడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. కోపాలు తాపాలు కొట్లాటలను వీడి
అందరివాడవై యలరవలయు
తనవారు పరులంచు ఁ దలపు రానీయక
అందరి హృదయాల నల్లవలయు
ఆర్గురైనట్టి నీయంతరాత్మ న గల్గు
ఆయరిషడ్వర్గ మణచవలయు
బురద పాలవరాదు బుద్ధి యెన్నడు గూడ
వికసితమై వెల్లి విరియ వలయు

తే.గీ. సాయముంజెయఁబూనియ సాగ వలయు
నిత్య చైతన్య దీప్తులు నెఱప వలయు
తల్లులను ఁ గన్నతల్లి నీతల్లి భార
తాంబ మెచ్చిన సుతుడ వీ ధరణి లోన!
*
తాత్పర్యం: ఓ భారతీ సుతుడా! కోపతాపాలను, కొట్లాటలను విడిచిపెట్టి అందరివాడవై నీవు ప్రకాశించాలి. తర తమ భేదాలు నీ మనసులోకి రానీక అందరినీ నువ్వు కలవాలి. అంతశ్శత్రువులైన కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలను అణచివేయాలి. నీబుద్ధి వికసించాలే గానీ బుదర పాలు కారాదు. చేతనైన సహాయమందిస్తూ నిత్య చైతన్య దీప్తులంతటా వెల్లి విరిసేలా శ్రద్ధవహించాలి.

కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262