Others

వేసవి తరుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయట చల్లగాలి
స్వాగతం పలికింది కిటికీ...
గది ఉక్కపోతకు
ఉపశమనం.

* వేడిని మింగి
చల్లదనం పంచింది
మంచుకొండ కాదు
మట్టికుండ.

* సూర్యుడు కురిపించాడు
నిప్పుల వర్షం
చెట్టు పూయించింది
నీడ పుష్పం.

* వేసవి గాలి సోకి
కొమ్మల నుండి
ఆకులకు...
ఎడబాటు.

* ఎండలు
మండే కాలం...
మనుషులకేనా?
మా ఊరి చెరువుకూ
దప్పికే...!

* చల్లని పానీయాలకు
చక్కని గిరాకీ...
హాట్..హాట్...
ఐస్‌క్రీమ్ రెడీ...!

* వేసవి పండుగకు
ఇంటికొచ్చిన చుట్టాలు
కూలర్లు, ఏ.సీ.లు.

* మాసమంతా చల్లగా
ఇల్లు..!..
మాసాంతం వేడిగా
బిల్లు..!!!?

* పుడమి ఒడిలో
వాన తడి
గుప్పుమంది
మట్టి పరిమళం.

* అడగకనే చల్లగాలి
పిలవకనే వానజల్లు
వేసవి వర్షం
ఎనలేని హర్షం.

-ఎ.నాగాంజనేయులు 99590 17179