Others

నాకు నచ్చిన పాట.. పిబరే రామరసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ సంస్కృతి ప్రభావంతో భారతీయ సంస్కృతి సత్సంప్రదాయాలకు పట్టుగొమ్మలైన సంగీత, సాహిత్యాలపై పెను ప్రభావం కనబరుస్తూ తెలుగు సినీ సంగీతం కూడా కలుషితవౌతున్న సందర్భంలో తెలుగువారి జీవన విధానం, ఔన్నత్యం, సంప్రదాయాల వైశిష్ట్యాన్ని చాటిచెప్పిన సినిమా ‘పడమటి సంధ్యారాగం’. జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం 1987లో విడుదలై విజయవంతమైంది. అమెరికా వెళ్లిన ఓ తెలుగువాడు అక్కడి విదేశీ సంస్కృతిలో ఇమడలేక, తన స్వదేశానికి తిరిగి రాలేక సంఘర్షణకు లోనవుతుంటాడు. ఉద్యోగ బాధ్యతల్లో పడి శ్రీరామనవమి పర్వదినాన్ని మర్చిపోతాడు. గుర్తుకొచ్చిన వెంటనే భవబంధాల చక్రంలో పడి నిన్ను మరిచిపోయినందుకు మన్నించు స్వామి అని శ్రీరాముని శాస్త్రోక్తంగా పూజ చేస్తాడు. సదాశివ బ్రహ్మం రచించిన ‘పిబరే రామరసం’ కీర్తన ఆలపిస్తాడు. ఎందరో రామభక్తులకు ఈ పాట భక్తిపారవశ్యానికి పరాకాష్టగా నిలుస్తుంది. అహిరభైరవ రాగంలో స్వరపర్చి ఈ పాటలు నేపథ్య గాయకుడు ఎస్పీ బాలు చాలా హాయిగా ఆలపించారు.
ఈ పాటలో విజయశాంతి స్వచ్ఛమైన తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి వయొలిన్ వాయిస్తుంది. విశిష్టరీతిలో చిత్రీకరణ జరిపిన ఈ పాట కోట్లాది తెలుగు సంగీత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. భౌతికంగా ప్రపంచంలో ఎక్కడ నివసించినా, మానసికంగా భగవంతుని ఉపాసిస్తూ ధ్యానిస్తూ ఆయన అపూర్వ కరుణా కటాక్షాలను సాధించుకోవడం సాధ్యమేనన్న అద్భుతమైన సందేశం ఈ పాట ద్వారా మనకందించారు. ఈ పాటంటే చాలామందిలాగే నాకూ చాలా చాలా ఇష్టం.
**

వెనె్నల రచయితలకు సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-సి ప్రతాప్, శ్రీకాకుళం