Others

అధ్యయనం.. అజ్ఞాననాశం( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే అలాంటి వాళ్ళు ఎప్పుడూ దుఃఖాల ఊబిలోనే ఉంటారు. ఒకవేళ మీ దుఃఖానికి మీరే కారకులైతే వెంటనే మీకు తోచినట్లు ఏదోఒకటి చేస్తారు. ఎందుకంటే, అది మీ చేతుల్లో ఉన్న పని. కానీ, ఇతరులు మీకు దుఃఖాన్ని కలిగిస్తుంటే మీరుమాత్రం ఏమిచెయ్యగలరు? అందుకే అందరూ ఆ బాధ్యతను ఒక్కొక్కప్పుడు భార్యపైకి, భర్తపైకి, పిల్లలపైకి, తల్లిదండ్రుల పైకి, అలాగే కుటుంబం, సమాజం, చరిత్ర, బాల్యం, తలరాత, దేవుళ్ళపైకి నెట్టేస్తూ ఉంటారు. అందుకు చెప్పే కారణాలు వేరైనా చేసేది కేవలం బాధ్యతను ఇతరులపైకి నెట్టెయ్యడమే.
తనకు ఏమవుతుందో కూడా ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం వెనుకాడకుండా పూర్తిబాధ్యతను స్వీకరించేందుకు అంగీకరించేవాడే అసలైన మగాడు, మొనగాడు. అదే అసలైన ధైర్యం. ఎందుకంటే, అతడే అన్ని ఫలితాలకు బాధ్యుడు. కానీ, అలాచెయ్యడం చాలా కష్టమైనపని. అందుకే ‘‘అన్ని ఫలితాలకు పూర్తి బాధ్యత నీదే అయినప్పుడు అసలు ఆ పని చెయ్యడమెందుకు?’’అంటూ ఒక పక్క మీ మనసు మీకు నస పెడుతూనే ఉంటుంది. అందుకే మనం బాధ్యతను ఇతరులపైకి నెట్టేస్తూ ‘‘నేనే ఇతరులు పెట్టే చిత్రహింసలు భరిస్తున్నవాడిని. కాబట్టి, నేను మీకు ఏమిచెయ్యగలను? ఏమీ చెయ్యలేను. మహాఅయితే, మీతోపాటు ఏడుస్తూ దుఃఖసాగరంలో మునిగిపోగలను’’అంటూ బాధ్యతను ఏమాత్రం స్వీకరించకుండా చాలా తెలివిగా తప్పించుకుంటాము. మనం దేనిని అభ్యసిస్తే అందులోనే ఎదుగుతాం. ఏడుపులో కూడా అంతే. కాబట్టి, ఏడుపే అలవాటుగా మారి ఎప్పుడూ ఏడుస్తూ దుఃఖసాగరంలో మునిగిపోతాం.
కాబట్టి, ఎవరూ, ఏ శక్తి మీకు ఏదీ చెయ్యట్లేదు. మీకు మీరే అన్నీ చేసుకుంటున్నారు. చేసే పనినే ‘‘కర్మ’’అంటారు. మీరు చేసే పనులే మీ కర్మలు. కర్మ సిద్ధాంతమంటే ఇదే. మీరు ఒక పని చేస్తున్నారు. దానిని ఆపడం మీ చేతుల్లోనే ఉంది. ఆ పనిని ఆపే సమయంకోసం నిరీక్షించవలసిన అగత్యం మీకు ఏమాత్రంలేదు. కావాలనుకుంటే, మీరు ఆ పనినుంచి ఎప్పుడైనా బయటపడగలరు. కానీ, మనం ఒక అలవాటులో ఇరుక్కున్నాం. అందుకే మనం ఏడుపు ఆపగానే ఒంటరిగా భావిస్తాం. ఎందుకంటే, అంతవరకు మీకుతోడు, నీడగా ఉన్న దుఃఖంపోయింది కదా! ఎవరూ లేనప్పుడు కనీసం ఆ ఏడుపే మీకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే, దుఃఖాన్ని మీరు ఏరికోరి పెళ్ళిచేసుకున్నారు. అందుకే అది జన్మజన్మల బంధంగా తయారైంది. పెళ్ళిచేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు విడాకులు ఇవ్వక తప్పదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఎంతోకాలంగా మీరు అలవాటు చేసుకున్న, మీ మనసును చాలా కాలంగా పట్టిపీడిస్తున్న దుఃఖానికి వెంటనే విడాకులివ్వండి. దీనినే నేను ‘అసలైన ధైర్యం’’ అంటాను.
***
ప్రేమ- ధైర్యం
భయమంటే ప్రేమ లేకపోవడమే.
కాబట్టి, భయాన్ని పూర్తిగా మర్చిపోయి
ప్రేమతో ఏదైనా చెయ్యండి.
మీరు ఎంత చక్కగా ప్రేమిస్తే
అంత చక్కగా భయం అదృశ్యమవుతుంది.
మీరు గాఢంగా ప్రేమించినప్పుడు భయం దానంతటదే అదృశ్యమవుతుంది. ఎందుకంటే, భయం ఒక ప్రతికూల భావన. అది ఒక లేమి. అంటే లేకపోవడం. దీనిని మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మీరు ఎప్పటికీ భయాన్ని సరిగా అర్థం చేసుకోలేరు.
భయం చీకటి లాంటిది. చీకటికి ఉనికి లేదు. కానీ, అది ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిజానికి, వెలుగు లేనప్పుడే చీకటి ఉంటుంది.

- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.