Others

మాస్ రాజాతో....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమర్ అక్బర్ ఆంటోని తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో పునరాలోచనలో పడ్డారు మాస్‌రాజా రవితేజ. వెంటనే సెట్స్‌పైకి వెళ్లాల్సిన సినిమాల విషయంలోనూ కాస్త టైమ్ తీసుకొని, స్క్రిప్ట్‌ను పకడ్బందీగా ఉందని నిర్థారించుకున్న తర్వాతగానీ షూటింగ్ మొదలుపెట్టేందుకు ఒప్పుకోవడంలేదు. ప్రస్తుతం రవితేజ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం డిస్కోరాజా. రెండోది తెరి రీమేక్. విఐ ఆనంద్- రవితేజ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక తెరి రీమేక్ సన్నాహాలూ ఇపుడు జోరుగా సాగుతున్నాయి. సంతోష్ శ్రీనివాస్ మొదట ఈ రీమేక్ స్క్రిప్ట్‌ను పవన్ స్టైల్‌కు అనుగుణంగా తీర్చిదిద్దినప్పటికీ, పవన్‌తో సెట్స్‌మీదకు తీసుకెళ్లడం కుదరలేదు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ స్క్రిప్ట్ రవితేజ దగ్గరికొచ్చింది. దీంతో ఈ సినిమానూ డిస్కో రాజాతోపాటుగా సమాంతరంగా షూటింగ్ చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఫిలిం ఛాంబర్‌లో ఈ సినిమా కోసం కనకదుర్గ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్న టాక్ వినిపించింది. కాజల్ అగర్వాల్, క్యాథరిన్ ధ్రెసాలను హీరోయిన్లుగా ఎంపిక చేసినట్టు సమాచారం. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.