Others

‘డాక్టరు బాబు’ చిత్రం.(ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయలలిత, శోభన్‌బాబు ఫస్ట్ అండ్ లాస్ట్ కాంబినేషను. ఆ సినిమా నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి లెనిన్‌బాబు. రవీంద్ర ఆర్ట్స్ బ్యానరు అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి కొడుకు. (భరద్వాజ అన్నయ్య) ఆరోజు ప్రసాద్ లాబ్ ఆరుబయట శోభన్, జయలలిత కూర్చున్నారు. లోపల డబ్బింగ్ జరుగుతోంది. జయలలితకి పిలుపొచ్చింది. వెళ్లింది. ఇక్కడ చాలామందికి తెలియని విషయం జయలలిత జ్ఞాపకశక్తి. నాలుగు పేజీల మేటరయినా ఒక్కసారి పైనుంచి కిందికి దీక్షగా చూసిందంటే అంతే. మైండ్‌లో స్కాన్ అయిపోయినట్టే! ఒక్క అక్షరం పొల్లుపోకుండా చెప్పేస్తుంది.
ఆరోజుల్లో డబ్బింగు చెప్పే విధానం -లూప్ సిస్టమ్. అంటే సన్నివేశాల్ని మూడ్ డిస్టర్బ్ కాకుండా కట్ చేసి అది లూప్‌గా అతికించి పిక్చరు రన్ అవుతుంటే షూటింగులో ఏ ఎమోషన్స్‌తోనైతే డైలాగు చెప్పారో డబ్బింగ్ చెప్పేటపుడూ అంతే ఎమోషన్‌తో చెప్పాలి. అప్పుడు క్లారిటీతోబాటు పెర్‌ఫెక్షను వస్తుంది. ఆరోజు అనుకున్న సమయంకంటే ఒక అరగంట ముందే జయలలిత- శోభన్‌బాబుల డబ్బింగ్ (ఆ రోజుకి ప్లాన్ చేసిన డబ్బింగ్ పార్ట్‌మేరకు) పూర్తయిపోయింది. ఆర్టిస్టులకు పేకప్ చెప్పేముందు ఒకసారి అసిస్టెంట్ డైరెక్టరు ‘చెక్’ చేసుకుంటాడు. ఆరుబయట శోభన్, జయలలితలు కూర్చున్నారు. ఉమామహేశ్వరరావు హిందీ మాస్టారూ నేనూ మామూలే. ఎపుడూ వుంటాం. పిచ్చాపాటీ మాట్లాడుతుండగా ‘నేను యాక్టరుని కాకపోతే ఏమై వుండేదాన్ని?’ అని అడిగింది జయలలిత-
శోభన్‌బాబు తేలిగ్గా నవ్వేసి ‘ఏముంది! ఇండస్ట్రీలో నువ్వేకాదు ఏ తారైనా యాక్టరు కాకపోయినా... ఖచ్చితంగా డాక్టరయిపోతుంది’ అన్నాడు నవ్వుతూ.
‘మిగతావారి విషయం నాకనవసరం- నేనేమై వుండేదాన్ని??’ రెట్టిస్తూ ప్రశ్నించింది జయలలిత.
‘ఇది ఫార్ములా తల్లీ! ఇండస్ట్రీలో ఎవర్నడుగు. నువు యాక్టరువి కాకపోతే ఏమై వుండేదానివని- ఠక్కున చెప్పే సమాధానం డాక్టరు... మిగతా వాళ్ల విషయం నాకు తెలీదుగాని నువు ఖచ్చితంగా డాక్టరయి వుండేదానివి!’ కన్‌ఫర్మ్ చేశాడు శోభన్.
‘పందెమా?’ జయలలిత.
‘పందెం!’
‘ఎంత?’
‘ఎంతైనా!’
‘పదివేలు?’
‘అంతొద్దుతల్లీ... ఏదో పదో పాతికో’
‘మరి ఎంతైనా అన్నారు?’
‘ఏదో మాట వరసకంటాం’
‘పోనీ... వెయ్యి?’
‘డబ్బుతో ఆటలాడకూడదు- ఐనా నువ్వు ఎలా నిరూపిస్తావ్ మీ టీచరుని తీసుకొస్తావా? ఏమయినా ఆధారాలున్నాయా?’
‘వూరికే వెయ్యి రూపాయలూ ఇవ్వరుగా!’
జయలలిత- శోభన్ పందెం అంటే పందెం అనుకున్నారు. వెయ్యి రూపాయలు ఖాయం చేసుకున్నారు.
మళ్లీ మరుసటి రోజు.. అదే ప్రసాద్ లాబ్ డబ్బింగ్ థియేటరు.
ఆరుబయట- ‘మీరు పందెం ఓడిపోయారు. వెయ్యి రూపాయలివ్వండి!’ అంది జయలలిత. ‘ఓడిపోయారంటే ఒప్పుకుంటామా? దానికి రుజువులూ సాక్ష్యం?’ నిగ్గదీశాడు శోభన్‌బాబు. ఆ వెంటనే తాను చర్చ్ పార్క్ స్కూల్లో మూడో తరగతి ఇంగ్లీషు మీడియం చదువుతున్నప్పటి సావనీర్ తీసి చూపించింది. జయలలిత మూడవ తరగతి చదువుతున్నపుడే ఇంగ్లీషులో ఒక ఆర్టికల్ రాస్తూ ‘ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏన్ ఎడ్వొకేట్ లైక్ రాంజెట్మలానీ!’ అని రాసింది చూపించింది.
అంతే! అమ్మో? ఎంత రాజకీయమో! నువ్వు ఎడ్వొకేటువి అవుతావో అవ్వవోగాని గొప్ప రాజకీయ నాయకురాలవుతావు!’ అన్నాడు వెయ్యి రూపాయలు చదివించుకుంటూ.
చిత్రమేంటంటే -అదే జరిగింది.

-ఇమంది రామారావు 9010133844