Others

జీవన తరంగాలు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభన్‌బాబు, వాణిశ్రీ, కృష్ణంరాజు, చంద్రమోహన్, లక్ష్మి నటించిన ‘జీవన తరంగాలు’ చిత్రం ఇప్పటికీ ఎంతోమంది మనసులను వెంటాడుతుంది. ముఖ్యంగా సినిమాలో మనుషుల మధ్య ఉండే సంబంధాలను అద్భుతంగా దర్శకుడు ఆవిష్కరించాడు. అన్నాతమ్ముళ్ల అనుబంధం, స్నేహానికి ఉన్న విలువ గురించి నవలా రచయిత్రి చక్కగా సన్నివేశ పరంగా చెప్పారు. పుట్టినరోజు పండుగే అందరికీ అనే పాట ఇప్పటికీ రేడియోల్లో వినిపిస్తూ వుంటుంది. నందామయా గురుడ నందామయా కూడా వేదాంతాన్ని చెబుతుంది. ఈ సినిమాలో ముఖ్యంగా టైటిల్ సాంగ్ తల్లి పార్ధివ దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే సన్నివేశంలో వేదాంతం చెబుతున్నట్లుగా ఈ పాట సాగుతుంది. ఈ జీవన తరంగాలలో.. ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు బంధము అని అడుగుతుంది. పరమాత్మ చేతిలో ఆడించబడే చదరంగంలోని పావులం, మనం కీలుబొమ్మలం అని రచయిత చక్కగా చెప్పారు. తల్లి శవాన్ని అనుకోకుండా తన ప్రాణాన్ని రక్షించుకునే నిమిత్తం తన భుజంపై పెట్టుకొని కొంత దూరం మోస్తాడు కొడుకు. అప్పుడు భుజం మార్చుకోవలసి వస్తుంది. రుణం తీర్చుకోమంటుంది అంటూ ఎంతో పరిశీలనతో పాటలో రచయత రాశారు. శవం తలవైపు మోసే కొడుకు కాళ్లవైపు మోసే వారికన్నా కొంత బరువు వుంటుంది. అంచేత కొంత దూరంపోయాక భుజాలు మార్చుకోవడం పద్ధతి. అటు మోసేవాళ్లు, ఇటు మోసేవాళ్లు అటు మారతారు. ఊరి పొలిమేరలో దించిన తర్వాత ఇది జరుగుతుంది. కట్టెను కట్టెలు కాల్చక మానవు, కన్నీటికి చితిమంటలారవు’లాంటి మాటలు హృదయాన్ని కట్టిపడేస్తాయి. భార్యాభర్తల సంబంధాలు కట్టెల లాంటివి. సముద్రం నీటిలో రెండు కట్టెలు దగ్గరగా వస్తాయి. కొంతకాలం గడిచాక ఆ రెండు కర్రలు విడిపోయి, నీటిపై తేలిపోతాయి. ఈ విషయం బుద్ధిజం కూడా చెబుతుంది. భగవంతుని చర్యలు అనూహ్యం. కన్నకొడుకే అజ్ఞాతంగా వున్నా పరిస్థితుల ప్రభావంతో తల్లి శవాన్ని మోయాల్సిరావడం యాదృచ్ఛికమైనా అది దైవలీల. అందుకే ఈ చిత్రంలో ఎంతో అంతరార్ధం వుంది.

- బీవీ రాజు, గన్నవరం