Others

కుడి ఎడమైతే.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుడి ఎడమైతే పొరబాటులేదోయ్.. ఓడిపోలేదోయ్.. అంటూ ఘంటసాల గొంతులో భారంగా వినిపించే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. 1953లో వినోదా ఫిలింస్ నిర్మించిన విజయవంతమైన చిత్రం ‘దేవదాసు’లోనిది. బెంగాలీలో శరత్‌బాబు నవలల్ని చక్రపాణి తెలుగులోకి తర్జుమా చేశారు. ఈ చిత్రాన్ని బెంగాలీ, హిందీ, తమిళంలో వివిధ దర్శకులు ఎన్నోసార్లు తీశారు. కారణం ప్రేమ విషయంలో సాధారణ మానవుడి బలహీనత సంఘర్షణ విఫలాలు వుండటం అందరి మానవుల్లో వుండటమే! ఇన్ని భాషల్లో తీసిన వాటికంటే వినోదా దేవదాసు చుక్కల్లో చందమామలా వెలిగిపోయింది. ఈ పాట వ్రాసింది సీనియర్ సముద్రాల. ఆయన చక్రపాణితో జరిపిన సంభాషణల్లో చర్చించి వేదాంతం రాఘవయ్యగారితో దర్శకత్వం, అక్కినేని, సావిత్రి ముఖ్య పాత్రలతో చిత్రంతీసి యావద్భారత భాషల్లో సెభాష్ అనిపించుకున్నారు. పాటలు మణిమాణిక్యాలు. విషాదభరిత వేదాంత తత్త్వాలే. హీరో తాగుబోతు. ప్రేమించిన పార్వతి జమీందార్ భార్య అయింది. విఫల, వికల, మనస్కుడై ఈ పాట పాడుతాడు. పాటలోని అలపైడి బొమ్మ చిలకమ్మ పదాలు పార్వతిని, వేశ్య అయిన చంద్రముఖిని సూచిస్తాయి. విధి వక్రించింది. కుడి ఎడమలకు తేడా తెలియదు. గొప్ప విపత్తుముందు కష్టాలు, నష్టాలు, ఏపాటివి?? చందమామను మబ్బులు క్రమ్మితే ఏం చేయగలం? ఈ సంఘర్షణకు సముద్రాలవారు వ్రాసిన పాట సరిపోయింది. ఈ పాటను సంగీత దర్శకుడు సుబ్బరామన్- ఘంటసాల గారి గాత్రంలో విషాదాలు చిలికించారు. ‘సుడిలోకి’ దూకి ఎదురీదగ మునకే అన్న పదం హీరోకి భవిష్యత్ లేదు. విషాదాంతమే చివరకు జరిగేది అని సూచించింది.
ఈ పాట ఈనాటికీ ఏనాటికీ అజరామరంగా నిలిచింది అంటే అది ఒక్కరి సొత్తుకాదు. వేదాంతం, సముద్రాల, సుబ్బరామన్, ఘంటసాల సమిష్టి కృషియే అని చెప్పక తప్పదు. మొదటినుండి చివరవరకు విషాద భరితమైన ఈ చిత్రం పాటలతో అక్కినేని, సావిత్రి అద్భుత నటనతో దేశంలో తీసిన ఎన్నో దేవదాసు చిత్రాల్లో మకుటాయమానంగా అన్ని విలువలతో మేటిగా నిలిచింది. మానవుడిలో ఎన్నో కష్టాల పరంపర వచ్చినా ఎదురీది, నిలిచి సాధించాలి, ఇవి సహజమనే వేదాంత ధోరణిలో మనుగడ సాగించాలి అన్నదే ఈ చిత్ర ఆశయం!!

-జి రాఘవ, ఒంగోలు