Others

నాకు నచ్చిన చిత్రం.. బాటసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో ధైర్యవంతులే కాదు, పిరికివాళ్లూ ఉంటారు. తెలివైన వాళ్లేకాదు, అమాయకులూ ఉంటారు. మరి అలాంటివారి సంగతేమిటి? వాళ్ళు హీరోలుగా ఉండటానికి తగరా? అలాంటి వారిని గుర్తించకపోవడం, సానుభూతి చూపకపోవడం వాస్తవాన్ని విస్మరించడమేనని సూటిగా తెలియచెప్పిన చిత్రం ‘బాటసారి’. చిత్రంలో కథానాయకుడు సురేష్‌బాబు. మనిషిని చూడగానే అతనెంత అమాయకుడో, నెమ్మదస్తుడో తెలుస్తుంది. తనకేం కావాలో తనకే తెలియని అయోమయంలో తల్లిదండ్రులు పైచదువులకు అంగీకరించటం లేదని ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇతని దుస్థితిని గమనించిన ఒక జమీందారు తన పాపకు పాఠాలు చెప్పమని గురువుగా ఉద్యోగమిస్తాడు. అక్కడే అతనికి కథానాయిక తారసిల్లుతుంది. ఆమె ఒక బాల వితంతువు. ఆమె సంప్రదాయాలకు, కట్టుబాట్లకు తలఒగ్గి వుంటుంది. సురేష్ కూడా తనకు ఆమెమీద ఏర్పడినది ప్రేమో, గౌరవమో, అభిమానమో తెలుసుకోలేని అయోమయంలో ఉంటాడు. కథానాయిక మీద ప్రేమాభిమానాలు వదులుకోలేకపోతాడు. చివరకు ‘ఈ జన్మలో మనం కలిసి ఉండలేకపోయాం. వచ్చే జన్మలో అయినా మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కథానాయిక ఒడిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ఆ అమాయకుడు ఆమెకు ‘బాటసారి’గానే మిగులుతాడు. కథానాయిక చివరిదాకా అతనితో ఒక్కమాటగూడా మాట్లాడటానికి సాహసించలేక పోతుంది ఇదీ చిత్రకథ. ఈనాటికీ సమాజాన్ని పీడిస్తున్న వితంతువుల సమస్యను ఆనాడే ఆ చిత్రంలో ఎత్తిచూపారు. ప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ నవలను దర్శకులు రామకృష్ణ ఎంతో రసవత్తరంగా, కరుణామయంగా చిత్రీకరించారు. సంగీతం, పాటలు కూడా ఉత్తమంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘ఓ బాటసారీ.....’ అన్న టైటిల్ సాంగ్ ఇప్పటికీ మారుమ్రోగుతూనే వుంటుంది. నాగేశ్వరరావు దేవదాసులోకంటే కూడా మిన్నగా ఆ పాత్రలో జీవించారు. కథానాయికగా భానుమతి కూడా తమ పేరు ఇనుమడింపజేసేటట్టు నటించారు.

-ఎసి పుల్లారెడ్డి, అనంతపురం