AADIVAVRAM - Others

నారాయణ ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ లీలాతరంగిణి రచించిన శ్రీ నారాయణతీర్థులు క్రీ.శ.1675 ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, విశాఖ నక్షత్రం, గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కాజ గ్రామంలో జన్మించారు. వీరు తిరుపుందర్తి, తంజావూరు, తమిళనాడులో క్రీ.శ.1745లో సజీవ సమాధి పొందారు. అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో వీరి వర్థంతిని మాఘ శుద్ధ అష్టమినాడు జరుపుతారు. తమిళనాడులో వారి కేలండర్ మనకన్నా వేరుగా ఉండడం వల్ల, ఒక నెల తరువాత, మాసి మాసం అష్టమి నాడు చేస్తారు. జయంతి మాత్రం రెండు రాష్ట్రాలలో ఓ ఉత్సవంలాగా ఒకే తిథినాడు చేస్తారు.
పునర్జన్మ
వేదవ్యాసుడు శృంగారకవి జయదేవుడు, క్షేత్రయ్య, నారాయణ తీర్థులుగా జన్మలనెత్తాడని ఒక విశ్వాసం ఉంది. మాధవానలకవి బిల్హణుడు, బృహన్మంగళుడు, జయదేవుడు, నారాయణ తీర్థులుగా పునర్జన్మల నెత్తాడని ఇంకొక కథనం ఉంది. సిద్దేంద్రయోగి నారాయణ తీర్థుల శిష్యుడని, లేదు వారిద్దరూ ఒకరే అని వాదాలు కలవు. ఏది ఏమయినా వారిద్దరూ సంగీత, సాహిత్య, నృత్యములకు ఎనలేని సేవ చేసి భక్తిని ప్రచారం చేశారు.
జాతకము
శ్రీ నారాయణతీర్థుల జననము 3 జులై, 1675. 12 గం. 38 ని.లకు, కాజ గ్రామం, గుంటూరు జిల్లా. ఆం.ప్ర.
1.కన్యాలగ్నము - వర్గోత్తమాంశ అనగా నవాంశ లగ్నము కూడ కన్యయే.
2.జన్మ నక్షత్రము విశాఖ 4వ పాదము, వృశ్చికరాశి.
3.వృశ్చిక రాశిలో చంద్రునితో గురువు కలిసి యున్నందున గజకేసరి యోగము ఏర్పడినది.
4.రాహువు లగ్నాత్తు చతుర్థములో అనగా ధనుస్సులో నున్నాడు. కావున నిత్య సంచారి.
5.యురేనస్ సప్తమములో ఉన్నందున వివాహమైనప్పటికీ కుటుంబానికి దూరమయ్యెను.
6.శని అష్టమములో ఉన్నాడు. కావున దీర్ఘాయువు కలిగినది.
7.శుక్రుడు వృషభములో స్వక్షేత్రములో నున్నాడు.
8.రవి, కేతువులు దశమములో మిథునములో నున్నారు.
9.వివాహము అభిజిన్ముహూర్తములో జరిగినది.
10.కుజ, బుధులు ఏకాశమములో నున్నారు.
11.నవాంశ చక్రములో వర్గోత్తమమైనందున ఇచట కూడ లగ్నము కన్యయే.
12.నవాంశ చక్రములో చవి ఉచ్ఛ, శని ఉచ్ఛ, చంద్రుడు స్వక్షేత్రము, బుధుడు ఉచ్ఛ స్థానములలో నున్నారు. కావున గొప్ప యోగములు ఏర్పడినవి.
13.రాశి చక్రములో దశమాధిపతియైన బుధుడు జల తత్త్వరాశియగు కర్కాటకములో నుండి గురువుచే వీక్షింపబడుచున్నాడు. కావున గొప్ప సృజనాత్మక శీలి.
గ్రంథములు
తీర్థులవారు శ్రీకృష్ణ లీలాతరంగిణి, పారిజాతాపహరణము, హరిభక్తి సుధార్ణవము, శాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్య, భక్త్యధికరణమాల, సాంఖ్యకారికా వ్యాఖ్య, సాంఖ్య తత్త్వకౌముది వ్యాఖ్య, న్యాయకుసుమాంజలిటీక, న్యాయముక్తావళి టీక, భాట్ట భాషా ప్రకాశము, యోగసూత్ర వ్యాఖ్య, సిద్ధాంత బిందు, లఘుచంద్రిక, వేదస్తవటీక, వేదాంత విభావనాటకీ, వివరణ దీపిక రచించారు. ఇందులో కొన్ని ముద్రితములు. కొన్ని కాదు. ఈ అసూర్యంపశ్యలు వెలుగులోకి వస్తే మనం ధన్యులమవుతాము.
తరంగిణి
శ్రీ మద్భాగవతములోని దశమ స్కంధముని ఆధారంగా తీర్థులు శ్రీకృష్ణ లీలా తరంగిణి రచించారు. తరంగములనగా అలలు. తరంగములు గానము, నృత్యము చేసినప్పుడు భక్తి అలలుగా వృద్ధి చెందుతాయి. కాని తీర్థుల వారి తరంగిణి ఒక సునామీ (పెద్ద అల) వలె శతాబ్దాలుగా ఈ జాతిని పునీతం చేశాయి. ఇందులో శ్రీకృష్ణ జననం, బాల్య క్రీడలు, కాళీయమర్దనం, గోవర్థనగిరి నెత్తటం, రాసలీల, కంస వధ, రుక్మిణీ కళ్యాణము వర్ణింపబడినవి. పోతనగారి భాగవతంలో ‘అగ్ని ద్యోతనుడు’ అనే బ్రాహ్మణుడు రుక్మిణి లేఖను శ్రీకృష్ణుడికి అందజేస్తాడు. ఆ పేరు వ్యాస భారతంలో కానీ, తీర్థుల తరంగిణిలో కానీ కనిపించడం లేదు. అన్నిటినీ పవిత్రం చేసే అగ్ని ఆ బ్రాహ్మణుని రూపంలో వచ్చింది. తరంగములతో రుక్మిణీ కళ్యాణము/ పద్మావతీ శ్రీనివాస కళ్యాణము కొన్ని దశాబ్దాలుగా ఒంగోలులో తరంగములతో ఈ కళ్యాణములు ఏటా చేస్తున్నారు. గోపాలమేవదైవతం, త్వత్ప్రసాద క్షేమ కురుసతతం, రుక్మిణీ స్వయంవరం, శ్రీ వాసుదేవ ప్రభో, కళ్యాణం భవతు సదా, మాంగల్య ధారణ, రుక్మిణీ కళ్యాణం తరంగములతో ఉత్సవ మూర్తులకు కళ్యాణం చేస్తారు.
రుక్మిణి
ఈవిడ ప్రకృతి అయితే శ్రీకృష్ణుడు పురుషుడు. రుక్మిణి లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు విష్ణువు. రుక్మిణి జీవాత్మకు సంకేతం. శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవేశ్వర అనుసంధానమే భారతీయ కళల యొక్క పథము, గమ్యము. తరంగిణి చూసిన వారికి, పాడి, నృత్యం చేసేవారికి భక్తి, ముక్తి, రక్తి కలుగుతాయి.
భజన సంప్రదాయము
ఘోరకవి సంపత్‌కుమార్ వంటి మహనీయులు తరంగ గానముకే తమ జీవితాన్ని అంకితం చేశారు. నారాయణతీర్థుల తరంగములని భజనలుగా పాడటమే ఈ సంప్రదాయము.
జయ మంగళం - గౌరీ రాగం - ఆదితాళము
జయ మంగళం - నిత్య శుభ మంగళం
1. మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే
మంగళం రమణీయ మూర్తయే తే
మంగళం శ్రీవత్స భూషాయ శారంగణే
మంగళం నందగోపాత్మ జాయ
2. పూతనాకంసాది పుణ్యజనహారిణే
పురుహూత ముఖదేవహితకరాయ
సూతాయ విజయస్య సుందర ముఖాబ్జాయ
శీతకిరణాభిజనల భూషణాయ
3. నవనీత చోరాయ నందాదిగోపగో
రక్షిణే గోపికా వల్లభాయ
నారద మునీంద్రనుత నామధేయాయతే
నారాయణానంద తీర్థు గురవే

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి